తలయేరు గుండుకు ఆ పేరు ఎలా వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏమిటంటే..!

తిరుపతి( Tirupati ) అలిపిరి కాలినడక మార్గంలో ఉండే తలయేరు గుండుకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ గుండుకు మోకాళ్ళను అణించి ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి తిరుమలకు నడిచి వెళ్తే కాళ్ల నొప్పులు ఉండవని చాలామంది భక్తులు నమ్ముతారు.

 How Did Thalayer Gundu Get That Name Its Significance Is , Tirupati, Thalayeru,-TeluguStop.com

వందల సంవత్సరాలుగా ఈ ఆచరం కొనసాగుతూ ఉంది.దానికి ఆనవాళ్లుగా తలయేరు గుండు పై ఎన్నో బొడుపులు ఉండడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.

ఇంతకీ ఈ తలయేరు గుండు వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన వైకుంఠనాథుడి దర్శనార్థం ప్రతిరోజు దేశ, విదేశాల నుంచి తిరుమల పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు తరలివస్తూ ఉంటారు.అందులో అధిక శాతం అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్ల మార్గం గుండా మెట్టు మెట్టు పసుపు కుంకుమలు రాస్తూ కర్పూరం వెలిగిస్తూ గోవింద నామాస్పరణాలను చేస్తూ ఎంతో భక్తి భావంతో తిరుమల కొండకు వస్తూ ఉంటారు.భక్తులు ఎంతో కష్టంతో చిన్న పిల్లలు, వృద్ధులు సైతం అలవోకగా ఏడుకొండలను ఎక్కి స్వామి వారిని దర్శిస్తే చాలు తమ కష్టమంతా తీరిపోతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు.

అయితే అలిపిరి పాదాల మండపం దాటి రాగానే 100 మీటర్ల తర్వాత తలయేరు గుండు కనిపిస్తుంది.

ఈ తలయేరు గుండు పూర్వం అలిపిరి( Alipiri ) మార్గంలో మెట్ల నిర్మించాక ముందు ఈ ప్రాంతంలో ఒక సెలయేరు దానికి ప్రక్కనే ఒక గుండు కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.అలిపిరి మెట్ల మార్గం నిర్మించ క్రమంలో తలయేరు గుండు కొట్టి పక్కకు జరపడం ద్వారా తలయేరు గుండు మార్గాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.అయితే పూర్వం ఈ మార్గం గుండా తిరుమల కు వెళ్లి శ్రీకృష్ణదేవరాయలు సైతం ఈ తలయేరు గుండు వద్ద తలవాల్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లారని పురాణాలలో ఉంది.

అందుకే ఈ రోజుకి ఇక్కడ భక్తులు మోకాళ్లు ఆణించి, తలవాల్చి ఆంజనేయుడిని నమస్కరించి తిరుమలకు ప్రయాణం సాగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube