శ్రీకాళహస్తి దేవస్థానం నుండి దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని.దుర్గమ్మకు శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో కెవి సాగర్ బాబుతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు.

 Srinivasulu, The Chairman Of The Temple, Presented Silk Robes To Goddess Durga F-TeluguStop.com

శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్, ఈ.వోలు కలిసి అమ్మవారి పేరున కనకదుర్గమ్మ ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి దసరా శరన్నవరాత్రుల సమయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్తాలను అందజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా శ్రీకాళహస్తి ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సమయంలో శ్రీకాళహస్తి డిప్యూటీ ఈవో ఎన్.ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కె.అయ్యన్న, ఆలయ కమిటీ సభ్యులు మున్నా రాయల్, జయ శాయ్యంరాయల్, సునీత, రమాప్రభ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube