విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేశినేని నాని మోసగాడని మండిపడ్డారు.
కేశినేని నానిని గతంలో చిరంజీవి, నిన్న చంద్రబాబు గెంటేశారని ఎద్దేవా చేశారు.కేశినేని నానిని జగన్ కూడా తరిమేస్తారని తెలిపారు.
ఈ క్రమంలోనే టీడీపీలో ఎవరు అవినీతిపరులో దమ్ముంటే చెప్పాలని ఛాలెంజ్ చేశారు.అలాగే విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నానిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.







