తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.విద్యార్థుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు.
కానీ స్టూడెంట్స్ కు ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు.ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు.
ప్రభుత్వ యూనివర్సిటీలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.శాఖల వారీగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
పది శాతం పైగా నిధులు విద్య కోసం ఖర్చు చేస్తామన్నారు.రాష్ట్రంలో పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని వెల్లడించారు.







