ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ కాస్ట్యూమ్స్ విషయంలో అస్సలు తగ్గరనే చెప్పాలి.ఈవెంట్ కు తగ్గ దుస్తులను ధరించి అందరి దృష్టిలో పడుతుంటారు.
అంతేకాకుండా కొన్ని రకాల కాస్ట్యూమ్స్ తో స్పెషల్ అట్రాక్టివ్ గా నిలుస్తారు.అందులో ఒకరు తమన్నా కూడా.
ఈ ముద్దుగుమ్మ ట్రెండీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా కు ఉన్న క్రేజ్ కూడా అంతా ఇంతా కాదనే చెప్పాలి.
తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళనే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను కూడా ఫిదా చేసింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల దృష్టిలో పడి వారి సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.
తన నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి.అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు మిల్కీబ్యూటీ అని పేరు సంపాదించుకుందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.పైగా తన వేసుకునే డ్రెస్ ల గురించి చెప్పడం కంటేనే.తన సోషల్ మీడియా వేదికనో లేదా ఇతర ఈవెంట్ వేదికలలోనూ తనని చూస్తే అర్థమవుతుంది.ఈవెంట్ కు తగ్గ డ్రెస్ ధరించి అందరికీ స్పెషల్ అట్రాక్టివ్ గా నిలుస్తుంది.
అప్పుడప్పుడు తను పాల్గొనే ఇంటర్వ్యూలలో కూడా డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది.ఇక ఈ అమ్మడు తన కాస్ట్యూమ్స్ విషయంలో ఎంత ఖర్చైనా చేస్తుందంటే నమ్మాల్సిందే.
అలా తాజాగా లో మరో కాస్ట్లీ డ్రెస్ తో దర్శనమిచ్చి అందరి హృదయాలను మరోసారి దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ ప్రారంభ వేదిక కు హాజరు కాగా అందులో తను స్కై బ్లూ కలర్ షార్ట్ డ్రెస్సులో దర్శనమిచ్చింది.ఆ డ్రెస్ లో తను ఎంతో అందంగా కనిపించగా అందరి దృష్టి తనపై పడింది.దీంతో ఆమె ధరించిన డ్రెస్ గురించి బాగా చర్చలు జరగటంతో.
ఆ డ్రస్ ధర తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు.
ఇంతకు ఆ డ్రస్ ధర ఎంతంటే.రూ.2,69,121. పైగా ఆమె వేసుకున్న చెప్పుల ధర కూడా రూ.90,800 అని తెలియటంతో ఈ ధరలను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతారు.మరికొందరు ఇంత ధరలు పెడితే కష్టమే అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలలో బాగా బిజీగా ఉంది.విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా గుర్తుందా శీతాకాలంలో బిజీగా ఉంది.
మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.







