యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తున్న ఏకైక నటుడు ప్రభాస్…( Prabhas ) ప్రస్తుతం ప్రభాస్ పేరు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా వినిపిస్తుందనే చెప్పాలి.బాహుబలి సినిమా ఎప్పుడైతే చేశాడో అప్పటినుంచి ప్రభాస్ పేరు ప్రపంచం నలుమూలాల మారు మోగిపోతుంది.
ఇక ఇప్పుడు తన ప్రతి సినిమా భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాడు.
ఇక ఇప్పటికే డిసెంబర్ లో వచ్చిన సలార్ సినిమా( Salaar ) సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరొకసారి ప్రూవ్ చేసింది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన కెరీయర్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ఎందుకు చేశాన అని బాధపడుతూ ఉంటాడట.అందులో మొదటిది రాఘవేంద్ర సినిమా.
( Raghavendra Movie ) అయితే అప్పుడు ప్రభాస్ ఉన్న క్రేజ్ కి ఆ సినిమా అసలు సెట్ అవ్వలేదు.
దాంతో రాఘవేంద్ర సినిమా ప్రభాస్ కెరియర్ ని చాలా వరకు డౌన్ ఫాల్ చేసిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాతో పాటుగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు( Adavi Ramudu Movie ) సినిమాని కూడా తను చేసి ఉండకపోతే బాగుండేదని తన సన్నిహితుల దగ్గర తెలియజేసేవాడట.అయితే ఈ సినిమా కథపరంగా తనకి బాగా నచ్చినప్పటికీ దాని మేకింగ్ పరంగా మాత్రం చాలా మిస్టేక్ లు చేయడం
అలాగే మధ్యలో కథను కూడా చేంజ్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉండడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.అయితే ఈ రెండు సినిమాలు చేయడం వల్ల ప్రభాస్ పేరు అనేది బాగా డామేజ్ అయింది.దానివల్ల ఈ సినిమాలు చేసి ఉండకపోతే బాగుండేదని తన సన్నిహితుల దగ్గర సందర్భం వచ్చిన ప్రతి సారి ప్రభాస్ చెబుతూ ఉంటాడట…