రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) ముగిసింది.ఇంతకు ముందు ప్రసారమైన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ బంపర్ హిట్ అయ్యింది.
టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో స్టార్ మా ఛానల్ ని మరోసారి ఇండియాలోనే టాప్ 1 ఛానల్ గా నిలిపింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఈ షో అయిపోయిన వెంటనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ రెండవ సీజన్ ని( Bigg Boss Non-Stop OTT 2 ) ప్లాన్ చేద్దాం అనుకున్నారు.దీని గురించి మీటింగ్ డిసెంబర్ 25 న ప్లాన్ చేసారు.కానీ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కారణంగా బిగ్ బాస్ యాజమాన్యం పై పోలీస్ కేసు నమోదు అయ్యింది.
ఆ కారణం చేత బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ కి సంబంధించిన చర్చలను వచ్చే నెలకి వాయిదా వేశారు.

ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా లో ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారం అవుతుంది.అదేమిటంటే రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క శిరీష( Barrelakka Sirisha ) ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఒకవిధంగా చెప్పాలంటే ఈమె ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టో పాయింట్స్ జనాలను ఆలోచింపచేసేలా చేసింది.
అంతే కాదు బీఆర్ఎస్ పార్టీ కి అన్నీ నియోజకవర్గాల్లో ఈమె ప్రభావం ఓటర్లలో బలంగానే పడింది.ఆమెకి పడింది కేవలం ఆరు వేల ఓట్లు అయినా, ఆమె పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
ముఖ్యంగా సోషల్ మీడియా లో అయితే ఆమెకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు , అందుకే ఆమెని ఈ సీజన్ లో తీసుకుంటున్నారట బిగ్ బాస్ టీం.ఈ షో ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం ఉంది.

ఈమెతో పాటుగా ఈ సీజన్ లో పాల్గొనబోయే మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి.వారిలో భోలే శవాళీ ,( Bhole Shavali ) నయనీ పావని( Nayani Pavani ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.నయనీ పావని కేవలం ఒక్క వారం మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది కానీ, భోలే మాత్రం ఈ సీజన్ లో క్రియేట్ చేసిన ఇంప్యాక్ట్ మామూలుది కాదు.ఆయన పంచిన ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
అందుకే ఓటీటీ రెండవ సీజన్ లో కూడా ఆయన అడుగుపెట్టబోతున్నాడు.వీరితో పాటుగా సరిగమప షో ద్వారా పాపులర్ అయిన పార్వతి తో( Parvathi ) పాటుగా ప్రముఖ యూట్యూబర్, బిర్యానీ చెయ్యడం లో స్పెషలిస్ట్ మొయిన్ బాయ్( Moin Bhai ) కూడా ఒక కంటెస్టెంట్ గా పాలగోనబోతున్నట్టు తెలుస్తుంది.