నేటి ఆధునిక కాలంలో చిన్న వయసు వారిలో సైతం తెల్ల జుట్టు సమస్య కనిపిస్తోంది.జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జుట్టు సంరక్షణం లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల యంగ్ ఏజ్‌లోనే నల్ల జుట్టు క్రమంగా తెల్లబడిపోతోంది.
అయితే ఈ సమస్యకు మీరు దూరంగా ఉండాలీ అని అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను ఖచ్చితంగా పాటించండి.మరి ఆలస్యమెందుకు ఆ టిప్స్ చూద్దాం పదండి పదండి.
మొదట మీరు చేయాల్సింది ఒత్తిడికి దూరం అవ్వడం.ఎందుకంటే తెల్ల జుట్టు రావడానికి ముఖ్య కారణాల్లో ఒత్తిడి ఒకటి. కాబట్టే, ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే తెల్ల జుట్టు వచ్చే అవకాశం అంత తగ్గుతుంది.చాలా మంది చేసే తప్పు జుట్టుకు నూనెను ఎవైడ్ చేయడం.
కానీ, స్వచ్ఛమైన నూనెను రెగ్యులర్‌గా తలకు పట్టించాలి.మరియు వారంలో తప్పకుండా రెండు సార్లు తల స్నానం చేయాలి.
తద్వారా త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
అలాగే వారంలో ఒకసారైనా న్యాచురల్ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.
ఒక బౌల్‌లో ఎండబెట్టిన కరవేపాకు పొడి, ఎండబెట్టిన ఉసిరికాయల పొడి, పెరుగు మరియు కొద్ది నిమ్మ రసం వేసుకుని బాగా కలిపి జుట్టు మొత్తానికి పట్టించాలి.గంట తర్వాత గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.
ఇలా ప్రతి వారం చేస్తే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.మరియు పొడి జుట్టు, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా ఉండవు.

ఇక ఎండల్లో అధికంగా తిరడం వల్లా జుట్టు త్వరగా తెల్ల బడిపోతుంది.సో ఎండల్లో ఎక్కువగా తిరగకండి.ఒకవేళ తప్పదు అనుకుంటే జుట్టును క్లాత్‌తో కవర్ చేసుకోండి.ధూమపానం చేయడం వల్ల సైతం ఫాస్ట్‌గా హెయిర్ వైట్‌గా మారిపోతుంది.అందుకే ధూమపానానికి దూరంగా ఉండండి.డైట్‌లో పోషకాహరం ఉండేలా చూసుకోండి.
మరియు కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రోడెక్ట్స్‌ను హెయిర్‌కు అస్సలు యూజ్ చేయకండి.