యూకే: యువత భవిష్యత్‌కు బంగారు బాట.. భారత సంతతి సామాజిక వేత్తకు ప్రతిష్టాత్మక పురస్కారం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లున్నారు.అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు.

 Indian-origin Youth Mentor Trevor Gomes Wins Uk Pm's Award, Trevor Gomes ,pm's A-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన సామాజిక కార్యకర్త ట్రవర్ గోమ్స్‌ను బ్రిటీష్ ప్రభుత్వం .ప్రతిష్టాత్మక ‘‘ పాయింట్ ఆఫ్ లైట్ ’’ అవార్డుతో సత్కరించింది.ఈ మేరకు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆయనకు అవార్డును బహుకరించారు.వ్యక్తిగత వాలంటీర్లకు, సంఘంలో మార్పు కోసం కృషి చేసే వారికి ఈ అవార్డును అందజేస్తారు.
లండన్‌లో స్థిరపడిన గోమ్స్ .భారతదేశంలోని అందమైన రాష్ట్రం గోవాకు చెందిన వారు.2019లో ఎలివేట్ అనే స్వచ్ఛంద సంస్థను ఆయన స్థాపించారు.వెనుకబడిన నేపథ్యాలకు చెందిన యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఈ సంస్థ ముఖ్యోద్దేశం.

వాస్తవానికి 6వ ఫారం కాలేజీలో 15 మంది విద్యార్థులకు మద్ధతుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి గోమ్స్.లాక్‌డౌన్ సమయంలో తన ఆశయాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు.ఎలివేట్ ఇప్పుడు 10,000 మందికి పైగా విద్యార్ధులకు చేయూతను అందిస్తోంది.మెంటరింగ్‌తో వర్క్‌షాపులను మిళితం చేస్తూ వరుసగా పలు కార్యక్రమాలను గోమ్స్ అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వీక్లీ గ్రూప్ మెంటరింగ్ అందించే బ్రేక్ ఫాస్ట్ క్లబ్ కూడా వుంటుంది.ఇందులో భాగంగా ప్రెజెంటేషన్‌లు, ఇంటర్వ్యూలు, నెట్‌వర్కింగ్‌లలో యువత నైపుణ్యాన్ని మెరుగుపరిచే అనేక రకాల కార్యక్రమాలను అందిస్తున్నారు.

కెరీర్, రెజ్యూమ్ నిర్వహణ, ఆన్‌లైన్‌ నెట్‌వర్కింగ్, పర్సనల్ బ్రాండింగ్‌కు మెరుగులు దిద్దుతారు.
పాయింట్ ఆఫ్ లైట్ అవార్డుకు తాను ఎంపికవ్వడం పట్ల గోమ్స్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇది తనకు దక్కిన గౌరవమన్నారు.

యువత జీవితాలకు మద్ధతు ఇవ్వడానికి తాను నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్లు గోమ్స్ చెప్పారు.వృత్తి జీవితంలో అడుగుపెట్టడానికి యువతకు మంచి మద్ధతు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎలివేట్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది యువత జీవితాలను మార్చేందేందుకు దోహదపడినందుకు తాను ఎంతో సంతోషంగా వున్నట్లు గోమ్స్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube