నిన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్( TDP Super Six ) పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతో, అంతకుమించిన స్థాయిలో వైసీపీ మేనిఫెస్టో( YCP Manifesto ) ఉంటుందని అంతా అంచనా వేశారు.
కానీ జగన్ ప్రకటించిన మేనిఫెస్టో పార్టీ నేతలతో పాటు, జనాలకూ ఉసూరుమనిపించింది.దీనికి కారణం చంద్రబాబు 4,000 పెన్షన్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించడంతో, కనీసం 5000 అయినా జగన్ ప్రకటిస్తారని జనాలు అంచనా వేశారు.
కానీ జగన్ మాత్రం ఇప్పటికిప్పుడు పెన్షన్ పెంచే పరిస్థితి లేదనే విధంగా తమ ఎన్నికల మేనిఫెస్టోలో 2028వ సంవత్సరంలో 250 , 2029లో 250 పెంచుతామని చెప్పారు.

ఇది మెజారిటీ పెన్షన్ దారుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.ఇప్పటికే చంద్రబాబు ( Chandrababu ) తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాదు రాకుండానే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్బో పెంచి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని, ఇంటికే పెన్షన్ అందే విధంగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ అంశాన్ని ప్రస్తావించలేదు.
చంద్రబాబు మాత్రం దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.

కానీ జగన్ మాత్రం ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.ఈ నేపథ్యంలో పెన్షన్( Pension ) విషయంలో టిడిపి పై చేయి సాధించినట్లుగా కనిపిస్తుండగా, జగన్ మాత్రం తాము అబద్ధపు హామీలు ఇవ్వలేమని, చేయగలిగిందే చెబుతామని చెబుతున్నారు.ఇప్పటికే మొన్నటి పెన్షన్ ఇంటికే అందించే విధానానికి బ్రేక్ పడే విధంగా టిడిపి నే పిటిషన్ వేసి ,జనాలను అనేక అవస్థలపాలు చేశారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.
దీనిపై టిడిపి జనాల్లో అభాసుపాలు అయ్యింది.అయితే ఇప్పుడు వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెన్షన్ తూతూ మంత్రంగా పెంచడం వంటివి ఎన్నికల సమయంలో వైసీపీకి ఇబ్బందికర అంశమే.
ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది.