పూర్వకాలంలో పురుడు వచ్చిన లేదా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించిన ఆశౌచం అంటే మైలా పాటించేవారు.ఈ విధానం భారతీయ సనాతన ధర్మం( Indian orthodoxy ) ప్రతిపాదించింది.
పూర్వం ఈ ఆచారాన్ని విశ్లేషిస్తే ఒక వాస్తవం వెలుగులోకి వస్తోంది.అదేమిటంటే ఒక ఇంట్లో శిశువు జన్మిస్తే ఆ సమయంలో తల్లి గర్భం నుండి కలుషితమైనవి బయటికి వస్తాయి.
అవి వాతావరణంలో అనేక హానిక సూక్ష్మజీవుల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.ఈ పరిసర ప్రదేశాలలో అనగా ఇంట్లో బాలింత ఉన్న ఇంట్లో ఆ యజమానికి సంబంధించిన దగ్గర బంధువులు చూడటానికి వచ్చినప్పుడు అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.
ఆ సమయంలో ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది.సాధారణంగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు కాబట్టి 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపి నీటితో సంపూర్ణ స్నానం చేయాలి.
అక్కడి వస్తువులన్నీ పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి.దీనిని పురిటి శుద్ధి అని అంటారు.మరణించిన మానవ శరీరం చుట్టూ క్షణాలలో చీమలు అపరిమితంగా గుమిగుడుతాయి.వాతావరణంలో మార్పుల కారణంగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్నో కోట్లలో ఆ ప్రదేశంలో వస్తాయి.

అదేవిధంగా సూక్ష్మజీవులు( Microorganisms ) జీవన ప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం.అయితే పెళ్లయిన ఆడపడుచులు నాలుగవ రోజున శుద్ధి స్నానం చేయాలి.ఎందుకంటే వారు సాధారణంగా వారి నిజవాసాలకు వెళ్తారు.ఇక శవదహనం( cremation ) తర్వాత వైరస్ వ్యాప్తి తగ్గుముఖం అవుతుంది.కాబట్టి మూడు రోజులు మైలాగా పరిగణించబడింది.అదేవిధంగా శవం ఉన్న సమయంలో చుట్టుపక్కల వంట లాంటి కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి.
ఎందుకంటే ఆ ప్రాంతం నుండి శవం తొలగించిన తర్వాత కూడా అక్కడ సూక్ష్మజీవులు ఉండే అవకాశాలు ఉంటాయి.

అందుకే మూడు రోజుల తర్వాత అక్కడ నివాసులు స్నానం చేసి వంట భోజనం కార్యక్రమాలు చేపట్టాలి.ఈ విధానాన్ని భారతీయ సాధన ధర్మం మైలా ( Myla )అని పాటిస్తూ ఉన్నారు.దీనిని ఇప్పటి శాస్త్ర విజ్ఞానం కూడా ఇమ్యూనిటీ అనే పేరుతో పాటించమంటున్నారు.
కాబట్టి అప్పటిలో చేయిస్తున్న మైలా విధానం ఇప్పటి పద్ధతిలో కూడా ఒకటే అని అర్థం.కాబట్టి మైలాను పాటించడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.