ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా.. సోనూసూద్ లా మంచి కార్యక్రమాలు.. అభిషేక్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో ఇతరులకు మంచి చేసే గుణం ఉండటం సాధారణమైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

ఐఏఎస్ ఉద్యోగానికి( IAS ) రాజీనామా చేసి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఎంతో మంచి మనస్సు ఉండాలి.

అలాంటి మంచి మనస్సు కొంతమందికి మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు.ఎంతో కఠినమైన ప్రిపరేషన్ ఉంటే మాత్రమే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

అభిషేక్ సింగ్( Abhishek Singh ) ఎంతో కష్టపడి ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.యూపీ కేడర్ కు చెందిన అభిషేక్ సినిమాలపై ఉండే ఆసక్తితో ఐఏఎస్ కు రాజీనామా చేశాడు.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 లో( Delhi Crime Season 2 ) ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ లో అభిషేక్ నటించారు.అభిషేక్ సింగ్ ఐఏఎస్ గా విధులు నిర్వర్తించే సమయంలో పలు వివాదాలలో సైతం చిక్కుకున్నారు.

Advertisement

సోనూసూద్ లా( Sonusood ) అభిషేక్ సింగ్ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.కరోనా సమయంలో అభిషేక్ రక్తదాన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ల అవసరాలను తీర్చాడు.కరోనా వ్యాక్సినేషన్( Corona Vaccination ) కార్యక్రమానికి సైతం అభిషేక్ తన వంతు సహాయం చేశారు.

అభిషేక్ సింగ్ తొలిసారి నటించిన షార్ట్ ఫిల్మ్ పేరు చార్ పండ్రా కాగా టీ సిరీస్ ఈ షార్ట్ ఫిల్మ్ ను నిర్మించింది.

అభిషేక్ కు ఇన్ స్టాగ్రామ్ లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.అభిషేక్ సింగ్ నటించిన ఒక పాటకు ఏకంగా 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.అభిషేక్ సింగ్ అటు ఐఏఎస్ ఆఫీసర్ గా ఇటు సినిమా నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు.

అభిషేక్ సింగ్ కెరీర్ పరంగా మరింత ఎదుగుతారేమో చూడాలి.అభిషేక్ సింగ్ సేవా కార్యక్రమాలు చేయాలని భావించే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు