కార్తీక శుద్ధ చవతి రోజున నాగుల చవితిని( Nagula Cavithi ) జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు.కానీ ఈ సంవత్సరం ఏ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో ప్రజలు సతమతమవుతున్నారు.
ఈ సంవత్సరం అధికమాసం కారణంగా ప్రతి పండక్కి రెండు డేట్లు వస్తుండడంతో ఏ రోజు అసలు పండుగ జరుపుకోవాలో ప్రజలకు తెలియడం లేదు.ఈ మధ్య కాలంలో జరుగుతున్న రాఖీ, వినాయక చవితి, దసరా, దీపావళి విషయంలోనూ అదే జరిగింది.
ఇప్పుడు నాగుల చవితి విషయంలోనూ అదే పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా చెప్పాలంటే నాగుల చవితి నీ కార్తీకమాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవతి తిధి రోజున జరుపుకుంటారు.
ఈ సంవత్సరం చవితి తిధి ఘడియలు నవంబర్ 16 గురువారం మధ్యాహ్నం 12:54 నిమిషములకు మొదలై, నవంబర్ 17 శుక్రవారం ఉదయం 11:30 వరకు ఉన్నాయి.రాత్రి వేళ చేసే పండుగలు అయితే రాత్రికి తిది ఉండడం ప్రధానం.మిగిలిన అన్ని పండుగలకు సూర్యోదయానికి తిధి ఉండడమే లెక్కలోకి వస్తుందని పండితులు చెబుతున్నారు.నాగుల చవితి రోజు సూర్యోదయానికి తిథి ప్రధానం కాబట్టి నవంబర్ 17వ తేదీన శుక్రవారం ఈ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
తెల్లవారుజామునే నిద్రలేచి తల స్నానం చేసి, ఎరుపు రంగు దుస్తులను ధరించి, పూజ మందిరన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
గడపకు పసుపు, కుంకుమ గుమ్మానికి తోరణాలు కట్టుకుని పూజ మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి.పూజకు ఎర్రటి పూలను ఉపయోగించడం మంచిది.బెల్లం బియ్యంతో చేసిన వంటకాన్ని తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి.
అరటి పండ్లు, వడపప్పు వంటి వాటిని నైవేద్యంగా తయారు చేయాలి.ఇంట్లో దీపారాధన చేసుకోవాలి.
పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము( Nagendra Ashtottaram ), నాగేంద్ర స్తోత్రములను పఠించాలి.తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లాలి.
పుట్ట దగ్గర పసుపు కుంకుమతో పూజించి దీపం పెట్టాలి.తెచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించాలి.
చవితి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. చవతి ఘడియలు శుక్రవారం ఉదయం 11:32 నిమిషముల వరకు ఉంటాయి.
DEVOTIONAL