సాధారణంగా ఒక్కోసారి ముక్కు నుంచి రక్తం వస్తుంటుంది.ముక్కులో సున్నితంగా ఉండే నాసికా పోరలు డ్రై అవ్వడం, జలుబు, సైనసైటిస్, ఎలర్జీ ఇలా రకరకాల కారణాల వల్ల రక్తం కారుతుంటుంది.దాంతో ఏం చేయాలో తెలియక తెగ భయపడిపోతుంటారు.రక్తం రావడాన్ని ఎలా తగ్గించుకోవాలో అర్థంగాక కంగారు పడిపోతుంటారు.అయితే అలాంటి సమయంలో కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలా సులభంగా సమస్య నుంచి బయట పడవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
ముక్కు నుంచి వచ్చే రక్తానికి అడ్డు కట్ట వేయడంలో కొత్తిమీర గ్రేట్‌గా సహాయపడుతుంది.ఫ్రెష్‌గా ఉండే కొత్తిమీరను తీసుకుని మెత్తగా నూరి రసం తీయాలి.
ఆ తర్వాత ముక్కలో రెండు లేదా మూడు చుక్కల కొత్తిమీర రసాన్ని వేయాలి.ఇలా చేస్తే రక్తం రావడం ఆగిపోతుంది.మరియు ఏవైనా ఎలర్జీ ఉన్నా తగ్గుతుంది.
ఐస్ క్యూబ్తోనూ ఈ సమస్యను నివారించుకోవచ్చు.ముక్కు నుంచి రక్తం వస్తున్న సమయంలో కొన్ని ఐస్ క్యూబ్స్‌ను కాటన్ క్లాత్‌లో వేసి ముక్కుపై ఉంచుకోవాలి.ఇలా చేస్తే కొద్ది సేపటికే రక్తం కారడం తగ్గు ముఖం పడుతుంది.
అలాగే ముక్కు నుంచి రక్తం వస్తున్నప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి.ఆపై ఫిల్టర్ చేసుకుని సేవించాలి.ఇలా చేస్తే రక్తం గడ్డకట్టి కారడం ఆగిపోతుంది.
విటమిన్ ఇ ఆయిల్‌తోనూ ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.విటమిన్ ఇ క్యాప్సుల్‌ను తీసుకుని కట్ చేసి ఆయిల్ తీయాలి.అనంతరం ఆ ఆయిల్‌ను ముక్కు లోపలి భాగంలో రాయాలి.
ఇలా చేసినా రక్తం రావడం తగ్గు తుంది.
ఇక ఈ టిప్స్‌తో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి.విటమిన్ సి, విటమిన్ కె, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
మరియు మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.