తన మాస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఊపు ఊపిన దర్శకుడు బోయపాటి శ్రీను.తన చిత్రాల్లో హీరోయిజాన్ని ఓ రెంజిలో చూపిస్తూ.శబ్బాష్ అనిపించాడు ఈ ఊరమాస్ దర్శకుడు. భద్రతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన శ్రీను.వెండితెరపై రక్తం చిందించేలా చేశాడు.ఆయన సినిమాల్లో కత్తులతో నరుక్కోవడం అత్యంత కామన్.
ఫైటింగ్ సీన్లలో వందలకొద్ది తలలు తెగిపడటం, డజన్ల కొద్ది చేతులు కాళ్లు నరకబడటం, సిల్వర్ స్క్రీన్ అంతా ఎరురంగు అద్దుకునేలా చేయడం ఆయన ప్రత్యేకత.ఇక ఆయన ఒక్కో సినిమాలో హీరో ఒక్కో రకమైన ఆయుధం వాడటం విశేషం.
ఏ హీరోకు తగిన విధంగా ఆ ఆయుధాన్ని తయారు చేయించాడు బోయపాటి.ఇంతకీ ఆయన ఏ సినిమాలో.ఎలాంటి ఆయుధాన్ని వాడారో ఇప్పుడు చూద్దాం.
తులసి
వెంకటేష్, నయనతార జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కోసం ప్రత్యేకంగా ఓ కత్తి చేయించారు.బోండాలు నరికే కత్తిని పోలి ఉండే వేట కొడవలిని ఇందుకోసం రెడీ చేయించాడు.
సింహ
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో స్పెషల్ కత్తిని వాడాడు.ఓవైపు చక్రం మరోవైపు పదునైన మొన ఉండే అద్భుత ఆయుధాన్ని వాడారు.
దమ్ము
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాలో పొడవాటి పదునైన కత్తిని ఉపయోగించారు.
లెజెండ్
2014లో బాలయ్య హీరోగా చేసిన లెజెండ్ మూవీలో మరో ప్రత్యేక ఆయుధాన్ని చూపించాడు బోయపాటి.సినిమా పేరుకు తగ్గట్లుగానే ఆయుధం కూడా రాయల్ లుక్ పోలిఉంది.
సరైనోడు
అల్లు అర్జున్ హీరోగా 2016లో విడుదల అయిన సినిమా సరైనోడు.ఈ సినిమాలో ఐరన్ బాల్ ను బన్ని ఆయుధంగా చూపించాడు.
జయ జానకి నాయక
వంకర్లు తిరిగిన కత్తులను బెల్లంకొండ శ్రీనివాస్ చేత పట్టించాడు బోయపాటి.ఈ ఆయుధం కాస్త వెరైటీగా కపించింది.
వినయ విధేయ రామ
ఈ సినిమాలో రామ్ చరణ్ ఒకవైపు కత్తిని.మరోవైపు గన్‌ను ఆయుధంగా మలుచుకున్నాడు.
NBK106
ఈసినిమా ట్రైలర్ లో విలన్ అనుచరులు కట్టెలు కోసే మిషన్లను చేతిలో పట్టుకున్నట్లు చూపించాడు.బాలయ్య ఎలాంటి ఆయుధం పట్టారో మాత్రం బోయపాటి చూపించలేదు.