తులసి మొక్కను ఈ విధంగా పూజిస్తే దురదృష్టం దూరమై అదృష్టం కలుగుతుందా..

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజల ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.ప్రతిరోజు చాలామంది ప్రజలు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు.

 Worshiping Tulsi Plant In This Way Will Bring Good Luck Details, Worshiping Tuls-TeluguStop.com

సనాతన ధర్మం ప్రకారం వేపా, తులసి, జిల్లెడు మొక్కలను మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎంతో పవిత్రంగా భావించి ప్రతిరోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు.అయితే తులసి మొక్కను మాత్రం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించి మరి పూజలు చేస్తూ ఉంటారు.

తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి దూరమై సానుకూల శక్తి వస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

అందువల్ల ప్రతి రోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడమే కాకుండా తులసి మాతకు నైవేద్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు.అంతేకాకుండా చాలామంది వారి సమస్యలను అధిగమించడానికి ఎన్నో రకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు.

అలా కాకుండా తులసి మొక్కను పూజించడం వల్ల దురదృష్టం దూరమై అదృష్టం వరిస్తుందని వేదపండితులు చెబుతున్నారు.తులసి మొక్కను ఏ విధంగా పూజిస్తే అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు ఉదయం తులసి మొక్క ఎదురుగా నైవేద్యం సమర్పించి దీపం వెలిగిస్తూ ఉంటారు.

Telugu Bhakti, Devotional, Luck, Lakshmi Devi, Pooja, Remove Bad Luck, Sri Maha

అలాగే సంధ్యా సమయంలో కూడా తులసి చెట్టు ఎదురుగా దీపం వెలిగించి పూజిస్తూ ఉంటారు.అయితే ఇలా దీపన్ని ప్రతిరోజు పిండితో తయారు చేసిన ప్రమితలో నెయ్యి వేసి అలాగే అందులో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు దూరం అవుతాయి.అంతేకాకుండా తులసి మొక్కకు నైవేద్యంగా బెల్లం పెట్టడం వల్ల ఇంటిపై మహావిష్ణువు అనుగ్రహం లభించి శిరీసంపదలకు లోటు ఉండదని వేద పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా పరమపవిత్రమైన తులసి మాతను మహావిష్ణువుకు సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube