మన శరీరంలో అతిపెద్ద అవయవంగా పేరు తెచ్చుకున్న లివర్ ఆరోగ్యం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు.కేవలం మద్యం మాత్రమే లివర్ కి హాని చేస్తుందని భావించేవారు మనలో ఎంతో మంది ఉన్నారు.
కానీ మద్యం కంటే అధికంగా కొన్ని కొన్ని ఆహారాలు మన లివర్ ని పాడు చేస్తాయి.దాని పనితీరును పూర్తిగా దెబ్బతీస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం లివర్ కి హాని చేసే ఆహారాలు ఏవేవో ఓ చూపు చూసేయండి.

వైట్ బ్రెడ్( White bread ).లివర్ ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాల్లో ఒకటి.ఎంతోమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా వైట్ బ్రెడ్ ను తింటున్నారు.
వైట్ బ్రెడ్ లో అధిక మొత్తంలో ఉండే షుగర్స్ మరియు కార్బోహైడ్రేట్లు ఫ్యాటీ లివర్ సమస్యకు కారణం అవుతాయి.గొడ్డు మాంసం, పంది మాంసంతో పాటు ప్రాసెస్ చేసిన మాంసంలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.
ఇది త్వరగా జీర్ణం కాదు.పైగా కాలేయంలో పేరుకుపోయి దాని పనితీరును నెమ్మదించేలా చేస్తుంది.
క్రమంగా కాలేయ సమస్యలు తలెత్తుతాయి.

అలాగే మనలో చాలామందికి ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది.ఈ అలవాటు మీకు కనుక ఉంటే కచ్చితంగా వదులుకోండి.ఉప్పు కాలేయ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
ప్రాసెస్ చేసిన మాంసాల మాదిరిగా వేయించిన ఆహారాల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.సంతృప్త కొవ్వును అధికంగా తీసుకోవడం వల్ల లివర్ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక కూల్ డ్రింక్స్( Cool Drinks ) కూడా మన కాలేయ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.కూల్ డ్రింక్స్ లో ఎలాంటి పోషకాలు ఉండవు.
కేవలం షుగర్స్ మాత్రమే ఉంటాయి.ఆ షుగర్స్ మన కాలేయంలో కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి.
ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది.కాబట్టి కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి.
కాలేయ ఆరోగ్యం కోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, నట్స్, సీడ్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆహారాలను తీసుకోండి.సీజనల్ గా దొరికే పండ్లను ఆహారంలో భాగం చేసుకోండి.
నిత్యం ఏదో ఒక హెర్బల్ టీను రోజు ఉదయాన్నే తీసుకోండి.







