నిత్యా మీనన్.ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగింది నిత్య.
బెంగళూరులో స్థిరపడిన మలయాళీ కుటుంబంలో జన్మించి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.నిత్య మీనన్ కేవలం నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా.
అలా మొదలైంది అనే సినిమాతో నాని సరసన హీరోయిన్ గా నటించి తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయ్యింది.కెరియర్ మొత్తం మీద 50 పైగా సినిమాల్లో నటించిన నిత్యమీనన్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.
ఇక ఆమె అవార్డుల విషయానికొస్తే ఇప్పటికే సౌత్ ఇండియా సినిమాలకు గాను మూడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకోగా రెండుసార్లు నంది బహుమతులు కూడా తీసుకుంది.34 ఏళ్ల వయసులోనూ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న నిత్యామీనన్ చాలామంది హీరోయిన్ల లాగా ఎక్స్పోజింగ్ కి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వదు.ఇక తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పుడు కాంట్రవర్సీలో కూడా నానుతూ ఉంటుంది నిత్య.అంతే కాదు తన జీవితం ఒక తెరిచిన పుస్తకం అని కూడా చెబుతోంది.

తనకు ఎప్పుడు, ఏది, ఎలా చేయాలి అనిపిస్తే అలాగే చేస్తానంటూ కుండ బద్దలు కొడుతుంది.మరోవైపు తను పెద్ద మేధావిని కాదంటూ తనకు ఏ విషయాలు సరిగా తెలియవంటూ కూడా ఒప్పుకుంటుంది నిత్యామీనన్ అంతే కాదు తనకు ఎవరి విషయాల్లోనూ పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదని, హీరోయిన్స్ పర్సనల్ లైఫ్ లో తొంగి చూడను అంటూ చెబుతోంది.ఇక ఆమె ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆలియా భట్ కి అసలు ఎప్పుడు పెళ్లయిందో కూడా తెలియదంటూ బాంబు పేల్చింది.తను గర్భవతిగా ఉన్న విషయం సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని, ఆలియా పెళ్లి చేసుకున్న విషయం నా దృష్టికి ఎందుకు రాలేదో తెలియదంటూ చెప్పి నవ్వులు పూయించింది.