కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మరో 14 రోజుల్లో కొత్త పార్టీని పెట్టబోతున్నారు.ఈ విషయాన్ని ఆజాద్ సన్నిహితుడు, మాజీ మంత్రి జీఎం సరూరీ తెలిపారు.
ఆజాద్ రాజీనామా చేసిన వెంటనే ఆయనకు మద్ధతుగా సరూరీ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా జమ్ముకశ్మీర్ కు చెందిన చాలా మంది నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు.
సెప్టెంబర్ 4న ఆజాద్ జమ్ముకశ్మీర్ కు వస్తున్నారని సరూరీ తెలిపారు.దీనిలో భాగంగా అదే రోజు పార్టీ ఏర్పాటుపై స్థానిక నేతలతో చర్చించనున్నారని వెల్లడించారు.
ముందుగా రాష్ట్రస్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తామని, అనంతరం జాతీయ పార్టీ విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా జమ్ముకశ్మీర్ లో 2019, ఆగస్ట్ 5వ తేదీకి ముందున్న స్థితిని పునరుద్ధరించాలనే అంశాన్ని ప్రధానంగా తమ పార్టీ మ్యానిఫెస్టోలో చేరుస్తామని స్పష్టం చేశారు.







