ఎన్నో చారిత్రక సంపదలకు, సాంప్రదాయాలకు భారతదేశం నిలయం.మన దేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే యాత్రికులు ఇక్కడ జరిగే మతపరమైన ఆలయాలను సందర్శిస్తూ, మంత్రముగ్ధులవుతారు.
భారతదేశం గొప్ప చారిత్రక స్మారక చిహ్నాలు, కోటలు, రాజభవనాలతో నిండి ఉంది.అంతేకాకుండా ఆధ్మాత్మిక సంపదకు కూడా భారత దేశం నిలయం.
భారతదేశంలోని అనేక ప్రసిద్ధ దేవాలయాలు భక్తులను పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తున్నాయి.ఈ ఆలయాలలో కొన్ని చాలా కాలం క్రితం నిర్మించబడ్డాయి.
భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలుగా విశ్వసించబడే కొన్ని దేవాలయాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో తిరుమల ఏడవ శిఖరంపై కొలువైన ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయం ఒకటి.దీనిని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు.ఆలయంలో 8 అడుగుల ఎత్తు ఉండే స్వామి వారి విగ్రహం ఉంది.దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా తిరుమల శ్రీవారి క్షేత్రం కీర్తికెక్కింది.అంతేకాకుండా ఎక్కువ మంది భక్తులు నిత్యం దర్శించుకునే దివ్యధామంగా పేరొందింది.ఆ తర్వాత స్థానంలో తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఉంది.
ఇది తిరువనంతపురంలో కొలువై ఉంది.ఇది ట్రావెన్‌కోర్ రాజ కుటుంబం ఆధ్వర్యంలో ఉంది.
ఈ ఆలయంలో పడుకున్న స్థితిలో విశిష్టమైన పద్మనాభస్వామి విగ్రహం ఉంటుంది.నేలమాలిగలలో ఈ దేవాలయంలో ఉండే ఆస్తులు అన్నీ ఇన్నీ కావు.ఈ దేవాలయానికి రూ.90 వేల కోట్ల విలువైన ఆస్తి ఉంది.ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్రలోని సిద్ధివినాయక దేవాలయం.ముంబైలో ఉండే ఈ ఆలయాన్ని 1900ల నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు దర్శించుకుంటున్నారు.మహారాష్ట్రలోనే షిర్డీలో నెలవై ఉన్న సాయిబాబా దేవాలయం కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి.1922లో దీనిని నిర్మించారు.దేశంలోనే మూడవ అతిపెద్ద ధనిక దేవాలయం ఇది.వివిధ మతాలకు, ప్రాంతాలకు చెందిన ప్రజలు వేల సంఖ్యలో దర్శనానికి వస్తుంటారు.పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో ఉండే గోల్డెన్ టెంపుల్ (స్వర్ణ దేవాలయం) కూడా ప్రసిద్ధ దేవాలయం.ముఖ్యంగా సిక్కులు ఈ ఆలయాన్ని అత్యంత పవిత్ర క్షేత్రంగా చూస్తారు.400ల కిలోల బంగారంతో ఈ ఆలయం పై అంతస్తులను నిర్మించారు.ఆలయం మొత్తం బంగారంతో పూత పూశారు.
ఆ తర్వాత స్థాయిలో మధురైలోని మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ఘనత వహించింది.నిత్యం 20 నుంచి 30 వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.50 మీటర్ల ఎత్తు ఉండే 14 గోపురాలు ఈ ఆలయంలో ఉన్నాయి.