పెళ్లి చేసుకునేందుకు మంచి మహుర్తాలు చూడాలి.అయితే వివాహాలు జరిపించేందుకు 27 నక్షత్రాల్లోని మఖ, మూల, మృగశిర, హస్త, అనూరాధ, స్వాతి, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి, రేవతి నక్షత్రాలు అత్యంత శుభప్రద మైనవిగా భావిస్తారు.కొన్ని విశేష నక్షత్రాలు ఇతర కార్యాలకు శుభకరమే కాని, వివాహ ముహూర్తాలకు సరిపడవని శాస్త్రాలు చెబుతున్నాయి.
పుష్యమి :
ఈ నక్షత్రం సమస్త శుభకార్యాలకు శుభ నక్షత్రమైనా వివాహానికి ఎంత మాత్రం పనికి రాదు.బ్రహ్మ తన పుత్రిక వివాహాన్ని ఈ నక్షత్రంలోనే చేశాడని, పెళ్లి సమయంలో బ్రహ్మ మదగ్రస్తుడైనట్లు వేదాలు చెబుతున్నాయి.అందువల్ల పుష్యమి నక్ష్త్రంలో వివాహాలు జరిపించ వద్దని పండితులు చెబుతుంటారు.
పూర్వ ఫల్గుణి:
వాల్మీకి ఋషి పూర్వ ఫల్గుణి నక్షత్రం ఉన్నప్పుడు సీతా రాముల వివాహం జరిగింది.సీతా రాముల వారు వివాహ బంధంలో సుఖ పడినట్లు రామాయణంలో చెప్పలేదు.
ఎప్పుడూ ఏదో కష్టం సీతమ్మను వేధిస్తూనే ఉంది.అందుకే ఈ నక్షత్రంలో వివాహం జరపడం సఫలం కాదని అంటారు.
నల దమయంతుల వివాహం అభిజిత్ నక్షత్రంలో జరిగింది.వారు అనేక బాధలు అనుభవించారు.అందువల్ల అత్రి మహర్షి ఈ నక్షత్రాన్ని వివాహానికి అశుభంగా ప్రకటించారు.
మూల :
మొదట్లో మూలా నక్షత్రాన్ని వివాహానికి అశుభంగా భావించే వారు.కాని భగవంతుడైన శ్రీ కృష్ణునికి జన్మనిచ్చిన దేవకీ దేవి వివాహం వసుదేవునితో మూలానక్షత్రంలో జరిగింది.అందుచేత తర్వాత ఈ నక్షత్రాన్నిశుభంగా భావిస్తున్నారు.
మఖ :
మఖ నక్షత్రానికి అధిపతులు పితృ గణాలు.వివాహంలో పితృ కార్యాలు వర్ణనీయాలు.
కానీ ఈ నక్షత్రంలో దక్ష ప్రజాపతి తన కుమార్తెలను కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు.అందువల్ల ఈ నక్షత్రాన్ని వివాహలకు శుభంగా భావిస్తారు.