రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పండుగ.చంద్రమాన కాలమానం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ లో 9వ నెలను రంజాన్ మాసం అని పిలుస్తారు.
ఈ నెలలోనే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ ఆవిష్కరించబడినదని ముస్లింలు విశ్వసిస్తారు.ముస్లింలు ప్రతిరోజు నిర్వహించే నమాజ్ నుంచి ప్రతిరోజు అవలంబించే పద్ధతుల వరకు ఎన్నో విషయాలు ఇస్లాం నుంచి ఆదర్శంగా తీసుకున్నాయి.
ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరులు 5 ప్రాథమిక విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలి.
ఇమాన్, నమాజ్, జకాత్, రోజా, హజ్ అనే 5 విధులను విధిగా పాటించాలి.
ఇమాన్: ఉపవాస సమయంలో భగవంతుడైన అల్లాహ్ పై ఎంతో నమ్మకం ఉండాలి.నమాజ్: 8 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్క ముస్లిం రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి.జకాత్: తమ స్థోమతను బట్టి దానధర్మాలు చేయాలి.రోజా: ఉపవాసం దీక్ష చేయడం.ఉపవాసదీక్షను ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారపానీయాలు సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండటం.హజ్: ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాలోని దైవగృహం కాబాను దర్శించాలి.
ఉపవాస దీక్ష ఎందుకు చేస్తారంటే.

రంజాన్ నెలలో ముస్లిం పవిత్ర గ్రంధమైన ఖురాన్ అవతరించిన నెలగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా ఉపవాస వ్రతాలతో గడుపుతారు.రుజు మార్గం చూపి, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి కాబట్టి ఆ మాసం అంతా విధిగా ఉపవాస దీక్ష పాటించాలి’.రంజాన్ మాసంలో జకాత్ – సద్కాలు ఎక్కువగా జరుగుతాయి.సహనానికి ప్రతీక రంజాన్ మాసం.దీనికి ప్రతిఫలం స్వర్గం. ఈ ఉపవాసం చేసేటప్పుడు తమ మనస్సు ఎంతో నిగ్రహంగా ఉంచుకోవడం, ఆగ్రహాలకు లోనుకాకుండా ఎంతో శాంతియుతంగా ప్రవర్తిస్తారు.