ప్రస్తుత సమాజంలో మధ్య తరగతి ప్రజల జీవితాలలో ఇల్లు కొనడం, కట్టడం అనేది ఒక కలగా మారిపోయింది.ఇంకా చెప్పాలంటే దాన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలి.
అందుకే ఇల్లు కొనుగోలు( house ) చేయడానికి కొన్ని ప్రాథమిక విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు( Chanakya ) చెప్పిన దాని ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు అక్కడ నివసించే పొరుగు వారి పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి.

సమీపంలో ప్రజలు సుభిక్షంగా ఉండడం ఎంతో ముఖ్యం.అటువంటి ప్రదేశంలో ఉండడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.దాని కోసం కష్టపడి పనిచేయడానికి మీలో ఉత్సాహం పెరుగుతుంది.
మీ చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావం మీపై ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.మీ చుట్టూ ఉన్న వారు పనికి రాని పనులు చేస్తున్నట్లయితే మీరు కూడా అలానే తయారవుతారు.
మీ ఇంటి చుట్టూ పక్కల విద్యావంతులు, మేధావులు ఉంటే ఇంకా ఎంతో మంచిది.మీ పిల్లలు అదే వాతావరణాన్ని చూస్తారు.
వారి మధ్య జీవిస్తారు.అటువంటి పరిస్థితిలో ఇది వారిపై సానుకూల ప్రభావాన్ని పెంచుతుంది.
జ్ఞానుల ఉండడం వల్ల మీరు కూడా జ్ఞానవంతులు అవుతారు.మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది.
మీపై కూడా సానుకూల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది.ముఖ్యంగా మీ పిల్లలకు మాత్రం ఇది ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

అలాగే వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు.ఇంకా చెప్పాలంటే ఇల్లు కట్టుకోవాలి అనుకునే చుట్టుపక్కల ప్రాంతంలో పాఠశాలలు, ఆస్పత్రులు( Schools, hospitals ) ఉండడం ఎంతో ముఖ్యం.పిల్లల చదువుల కోసం వారు మంచి పాఠశాలల్లో చదవడం ఎంతో ముఖ్యం.ఏదైనా ఆరోగ్య సమస్య విషయంలో మీరు సమయం మించి పోకుండా ఆస్పత్రికి వెళ్ళవచ్చు.మీ ఇల్లు నిర్మించుకునే స్థలంలో ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించుకుని ఇల్లు కొనడం, కట్టడం మంచిది.అలాగే మనం ఇల్లు నిర్మించుకునే ప్రదేశంలో భద్రత ఏర్పాట్లను కూడా కచ్చితంగా చూసుకోవాలి.
LATEST NEWS - TELUGU







