క్రమం తప్పకుండా కాకరకాయ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.కాకరకాయ మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
దీన్ని తీసుకోవడం వలన కాలేయంలో పేరుకుపోయిన విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి.అలాగే ముఖంపై ఉన్న మొటిమలు కూడా తొలగిపోతాయి.
ఇక ఇది టైప్ 2 డయాబెటిస్( Diabetes ) ని కూడా నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.కాకరకాయ చేదు అయినప్పటికీ కూడా ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది.
కాకరకాయ రసం తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.దీని గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్నిసార్లు ఆహారం జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది.దీంతో పొట్టలో గ్యాస్ సమస్య వస్తుంది.ఇక అజీర్ణ సమస్య( Indigestion Problems )కు కాకరకాయ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఈ రసం కడుపులోకి ప్రవేశించిన తర్వాత అవసరమైన మొత్తంలో జీర్ణ రసాలను స్రవించేలా కడుపుని ప్రేరేపిస్తుంది.
దీంతో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు అల్సర్ లాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.కాకరకాయ రసంలో బీటా కెరోటిన్ అలాగే విటమిన్ ఏ పోషకాలు ఉంటాయి.దీన్ని తీసుకోవడం వలన కళ్లకు కావాల్సిన పోషకాలు అందటంతో పాటు కంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.

ఇంకా ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇది మధుమేహం వలన వచ్చే దృష్టి లోపాన్ని నయం చేస్తుంది.కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటర్ న్యూట్రియెంట్స్ ఉంటాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
కాకరకాయను కూరగాయల రూపంలో తీసుకోవడం వలన మీ శరీరం నుండి కొలెస్ట్రాల్ తొలగించడంలో సహాయపడుతుంది.ఇక ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తీసుకుంటే రక్త శుద్ధి కూడా అవుతుంది.