తిరుమల నిత్య అన్న ప్రసాదం పై టిడిపి ఆరోపణలు..

తిరుమల వెంగమాంబ నిత్య అన్న ప్రసాదం పై వచ్చిన ఆరోపణలను టీటీడీ ఖండించింది.అన్న ప్రసాదం పై తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం తప్పు పట్టింది.

 Tdp Allegations On Tirumala Nitya Anna Prasadam ,  Tirumala Nitya Anna Prasadam-TeluguStop.com

అన్న ప్రసాదం బాగోలేదంటూ ట్విట్టర్ లో తెలుగుదేశం పార్టీ ఒక వీడియోను పోస్ట్ చేసింది.టీటీడీ పై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని టీటీడీ హెచ్చరించింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తుల వద్దకు నేరుగా వెళ్లి అభిప్రాయాలు స్వీకరించారు.

ఈ వీడియో లో భక్తులు అన్న ప్రసాదం బాగుందని,అన్నం బాగా ఉడికిందని చెప్పారు.

అన్న ప్రసాదం పై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేయడం మంచిది కాదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.స్వామి వారి ఖ్యాతిని, ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది.

తిరుమల వెంకన్నని ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి నిత్యాన్నదానంలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారని తెలుగుదేశం ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఎవరితో అయినా పెట్టుకోండి తిరుమల వెంకన్న తో మాత్రం పెట్టుకోకండి భక్తులకు నాణ్యమైన భోజనం పెట్టండి అని తెలిపింది.టిడిపి పోస్ట్ చేసిన వీడియో ఒక వ్యక్తి తిరుమల వెంగమాంబ నిత్య అన్న ప్రసాదంలో అన్నం సరిగా లేదని తెలిపాడు.రేషన్ బియ్యం వండుతున్నారని వాటినే మంత్రులు, టీటీడీ ఈవో, చైర్మన్ తినాలని వెల్లడించారు.

భక్తులకు నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపణలు చేశారు.

తిరుమలలో మార్చి 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద ఈ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఫోటో ఆధారిత బయోమెట్రిక్ అమలుతో దళారులకు అడ్డుకట్ట వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube