బుద్ధ పూర్ణిమ విశిష్టత మరియు చరిత్ర గురించి మీకు తెలుసా..?

పవిత్రమైన బుద్ధ పూర్ణిమను మే 5వ తేదీన శుక్రవారం రోజు ప్రజలందరూ జరుపుకుంటున్నారు.దీనినే బుద్ధ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

 Do You Know The Uniqueness And History Of Buddha Purnima ,buddha Purnima ,-TeluguStop.com

ఎక్కువగా ఈ వేడుకలను తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, థాయిలాండ్, చైనా, కొరియా, లావోస్, వియాత్నం, మంగోలియా, కంబోడియా, ఇండోనేషియా, భారత దేశంలో బౌద్ధులందరూ ఈరోజును ఆధ్యాత్మిక వేడుకల ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

Telugu Bhakti, Bodhi Tree, Buddha, Buddha Purnima, China, Devotional, Korea, Lum

బుద్ధ పూర్ణిమ ( Buddha Purnima )గురించి ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమను ప్రజలు జరుపుకుంటారు.బుద్ధుని జననా మరణాలకు సంబంధించి ఖచ్చితమైన తేదీలు చరిత్రలో ఎక్కడా చెప్పలేదు.

కానీ పూర్వీకులు అతని జీవితకాలం క్రీస్తుపూర్వం 563 నుంచి 483 అని చెబుతున్నారు.ఇది బుద్ధుని 2585 వ జయంతి అని చెబుతున్నారు.దృక్ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిధి మే 5వ తేదీన ఉదయం నాలుగు గంటల 14 నిమిషములకు ప్రారంభమై, ఆరవ తేదీన ఉదయం 3.33 నిమిషములకు ముగుస్తుంది.

Telugu Bhakti, Bodhi Tree, Buddha, Buddha Purnima, China, Devotional, Korea, Lum

బౌద్ధ మతస్థాపకుడు గౌతమ బుద్దుడు.ఆయన నేపాల్( Nepal ) లోని లుంబినిలో జన్మించారు.పౌర్ణమి రోజు బౌద్ధులకు చాలా విశిష్టమైనది.గౌతమ బుద్దుడు జీవితంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఇదే రోజున జరిగాయని దీనికి అంత ప్రాముఖ్యత ఉంది.మొదటిది ఆయన జననం.పౌర్ణమి రోజున లుంబిని లో ఆయన జన్మించారు.

రెండోది ఆరు సంవత్సరాల శ్రమ తర్వాత ఆరోజే బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది.సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా(Buddha ) మారిన రోజు కూడా ఇదే కావడం విశేషం.

Telugu Bhakti, Bodhi Tree, Buddha, Buddha Purnima, China, Devotional, Korea, Lum

మూడవది ఈరోజే ఆయనకు 80 సంవత్సరాలు ఉన్నప్పుడు కుసినారలో ఆయన నిర్వాణం పొందారు.ఇంకా చెప్పాలంటే ఈరోజు భక్తులు తమ ఇళ్ళను శుభ్రం చేసుకుంటారు.ఉదయాన్నే స్నానం చేస్తారు.గంగాజలాన్ని ఇంటి పరిసరాల్లో, ముఖ్య ద్వారం దగ్గర చల్లుతారు.కొవ్వొత్తి వెలిగించి ఇంటిని పూలతో అలంకరిస్తారు.ముఖ్య ద్వారం దగ్గర స్వస్తికం ను పసుపు లేదా కుంకుమతో దిద్దుతారు.

భోది వృక్షాని( Bodhi Tree )కి పాలు పోసి, కొవ్వొత్తి వెలిగిస్తారు.పేద ప్రజలకు, అవసరం ఉన్నవారికి ఆహారం, బట్టలు, ధనం ఇస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube