తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన నితిన్.ఆ తర్వాత వరుసగా తెలుగు ప్రేక్షకుల ముందుకు లవ్ స్టోరీలను తీసుకు వచ్చి సూపర్ హిట్స్ ను దక్కించుకున్నాడు.
ఒకానొక సమయం లో వరుసగా 10 సినిమా లు ఫ్లాప్ అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా కష్టపడి సినిమాల్లో నటించి ఈ స్థాయికి చేరుకున్నాడు.ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచిన నితిన్ త్వరలో మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా తో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.ఇక ఆ సినిమా లో నితిన్ కలెక్టర్ పాత్ర లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
సినిమా లో నితిన్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.ఆయన కు సంబంధించిన పాత్ర డిజైన్ కొత్తగా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా చెప్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చివరి దశ లో ఉంది.అది త్వరలోనే సినిమా ను విడుదల చేయబోతున్నట్లు సభ్యులు పేర్కొన్నారు.
నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా కు సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ ని విడుదల చేశారు.యూట్యూబ్ లో యాక్షన్ సీక్వెన్స్ కు మంచి స్పందన దక్కింది.
నితిన్ లుక్ మరియు యాక్షన్ సన్నివేశాల స్టైల్ ఆకట్టుకునే విధంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు హీరోయిన్ గా కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.ఆ సన్నివేశాలను పూర్తి చేస్తే సినిమా పూర్తి అయినట్లే అంటూ సమాచారం అందుతోంది.
నితిన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన వీడియో కు మంచి రెస్పాన్స్ వస్తుంది.అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో నితిన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మా తరఫున మరియు మీ తరఫున మాచర్ల నియోజకవర్గం కలెక్టర్ సాబ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.







