బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా ఉత్తరాది రాష్ట్రాలలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇలా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో భారీ అంచనాల నడుమ ఈయన నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రతి ఒక ప్రేక్షకుడిని తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు మరే సినిమాల్లో జరగకుండా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సలార్ షూటింగ్ ప్రారంభమై శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఉన్నఫలంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

శరవేగంగా షూటింగ్ జరుపుకొని ఈ సినిమాని వచ్చే వేసవి సెలవులలో విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ప్రభాస్ మోకాలు సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారు అయితే ఈయన సర్జరీ తర్వాత సుమారు రెండు మూడు నెలల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఈయన సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు.
దీంతో ఆయన నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.







