ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పండుగల సందర్భంగా ప్రసారం చేస్తున్న స్పెషల్ ఈవెంట్లకు మంచి రేటింగ్స్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే.ఉగాది పండుగ సందర్భంగా జెమినీ ఛానల్ లో ఫుల్ కిక్కు పేరుతో ఈవెంట్ ప్రసారం కానుండగా ఈ ఈవెంట్ లో మెగా బ్రదర్ నాగబాబు, జబర్దస్త్ కమెడియన్లు పాల్గొని సందడి చేశారు.
ఫుల్ కిక్కు ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జెమినీ ఛానల్ లో ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.
ప్రోమోలో చంటి ఈరోజు ఏమైనా సంక్రాంతా.గంగిరెద్దులంతా మనముందే తిరుగుతున్నారు అంటూ షోలో పాల్గొన్న లేడీస్ పై పంచ్ వేశారు.
శ్రీముఖి ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించగా లాలా భీమ్లా సాంగ్ తో నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.సోహెల్ షోలోకి ఎంట్రీ ఇవ్వగా శ్రీముఖి మొన్న సోహెల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని చెప్పి అందరూ షాకయ్యేలా చేస్తుంది.
ఆ తర్వాత శ్రీముఖి వీడియో ప్లే చేయమని చెప్పగా సోహెల్ ప్రెగ్నెంట్ లా కనిపించి షాకిచ్చారు.ఆ తర్వాత సోహెల్ ప్రెగ్నెన్సీని బాయ్స్ తీసుకునే ఆప్షన్ ఉంటే తీసుకుంటారా అని అడగగా ప్రభాకర్ ఏ ప్రాబ్లమ్ లేకుండా తీసుకుంటానని తన పొట్టను చూపిస్తాడు.
ఆ తర్వాత మేము వెళుతున్న చోట్లకు మీరు వస్తున్నారో లేక మీరు వెళుతున్న చోట్లకు మేము వస్తున్నామో అర్థం కావడం లేదని ధనరాజ్ షోలో నాగబాబుపై పంచ్ వేశారు.

ఆ తర్వాత రచ్చరవి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అని చెప్పగా నువ్వు వచ్చావ్ కదా డాడీ వాళ్లకు పండుగ ఎక్కడ ఉంటుందని రచ్చ రవి కూతురు పంచ్ వేస్తుంది.ఆ తర్వాత రచ్చ రవి భార్య షోలోకి ఎంట్రీ ఇచ్చారు.శ్రీముఖి రచ్చ రవిని భరిస్తున్నారు కదా అని అడగగా రచ్చరవి భార్య భరించడం లేదు ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చారు.
రచ్చ రవి జాలీగా ఉంటాడని అందరినీ ప్రేమిస్తాడని ఆమె తెలిపారు.కొన్నిసార్లు రవి కామెడీ చేస్తుంటే అందరూ కామెంట్లు చేస్తుంటారని ఆ సమయంలో బాధ వేస్తుందని ఆమె షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.







