సాధారణంగా కొందరికి ముఖంపై పింపుల్స్ పోయినా వాటి తాలూకు మార్క్స్ మాత్రం పోనే పోవు.ఈ పింపుల్ మార్క్స్ చూసేందుకు ఆసహ్యంగా కనిపించడమే కాదు.
అందాన్ని కూడా చెడగొడతాయి.అందుకే వీటిని నివారించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
ఎన్నెన్నో క్రీములు, సీరమ్‌లు వాడతారు.అలాగే తరచూ ఫేస్ ప్యాకులు వేసుకుంటారు.
అయినప్పటికీ, అవి తగ్గకుంటే తెగ బాధ పడుతూ ఉంటాయి.అయితే పింపుల్ మర్క్స్‌ను పోగొట్టడంలో ముల్లంగి గింజలు అద్భుతంగా సహాయపడతాయి.
ముల్లంగి గింజల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు పింపుల్స్‌ను, పింపుల్ మార్క్స్‌ను సమర్థవంతంగా నివారించగలదు.మరి ముల్లంగి గింజలను చర్మానికి ఎలా వాడాలి? అన్నది ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని ముల్లంగి గింజలను సేకరించి బాగా ఎండ బెట్టుకోవాలి.ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి.
ఇక ఈ ముల్లంగి గింజల పొడిని ఎలా యూజ్ చేయాలో కూడా చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ల ముల్లంగి గింజల పొడి, అర స్పూన్ నిమ్మ రసం మరియు అర స్పూన్ తేనె వేసుకుని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

అపై ఈ మిశ్రమాన్ని పింపుల్స్, పింపుల్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే గనుక మొటిమలు, వాటి తాలూకు మచ్చలు క్రమంగా మటుమాయం అవుతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ముల్లంగి గింజల పొడి, ఒక స్పూన్ పెరుగు మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో పూసి కాసేపు డ్రై అవ్వనివ్వాలి.అపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా పింపుల్ మార్క్ పోతాయి.