ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇవాళ్టి నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతి ఇచ్చారు.ఈ మేరకు మొదటి ఘాట్ రోడ్డును సిద్ధం చేశారు.
ఈ క్రమంలో ఆటోలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు, డీసీపీ రాజేశ్ చంద్రతో పాటు ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్ల తరువాత కొండపైకి ఆటోలను అనుమతి ఇస్తుండటంతో ఆటో డ్రైవర్లతో పాటు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రధానాలయం ఉద్ఘాటన నుంచి కొండపైకి ఆటోలకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
దీంతో పలు కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి.ఈ క్రమంలోనే కొండపైకి ఆటోలను అనుమతించాలంటూ కార్మికులు కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది.
కాగా ఇటీవల అధికారంలోకి వచచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యపై స్పందించింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఆటోలను కొండపైకి అనుమతి ఇస్తూ.
కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు.