తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు( Nandamuri Balakrishna )కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన నటించిన ప్రతి సినిమా ఒక అద్భుతమనే చెప్పాలి.
ఇక ఆయనకు మాస్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.గతంలో ఆయన చేసిన మంచి సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి.
ఇక ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) సూపర్ సక్సెస్ ను సాధించింది.మరి ఈ సినిమాని ఇప్పుడు ఇతర భాషల్లో రీమేక్ చేయాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక తమిళంలో విజయ్( Vijay ) ఈ సినిమా రీమేక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ సినిమా కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు సైతం భగవంత్ కేసరి సినిమాలో రీమేక్ చేసేంత కొత్త పాయింట్ ఏముందా అని ఆలోచిస్తున్నారు.కానీ నిజానికైతే బాలయ్య బాబు ఈ సినిమాలో ఒక మ్యాజిక్ అయితే చేశాడు.అందువల్లే ఈ సినిమా సక్సెస్ తీరాలకు చేర్చడమే కాకుండా బాలయ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా పోట్రే చేసుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేశాడనే చెప్పాలి.ఇక ఇప్పుడు విజయ్ ఈ సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడానికి చూస్తున్నాడు.నిజానికి విజయ్ చేయబోయే చివరి సినిమా కూడా ఇదే కావడం విశేషం… మరి బాలీవుడ్ లో ఈ సినిమాని ఎవరు చేస్తున్నారు అనే దానిమీద క్లారిటీ లేదు.కానీ బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది…
.