సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఆయన అటు రాజకీయ రంగంలో రాణిస్తూనే అవకాశం దొరికినప్పుడు సినిమాలను కూడా చేస్తున్నాడు.
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సాధించిన ఘనవిజయం ముందు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ దిగదుడుపు అనే చెప్పాలి… ఆయనకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆయన వరుస సినిమాలను చేయలేకపోయిన కూడా అభిమానులను అలరించడానికి అడపదడప సినిమాలు మాత్రం చేయడానికి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలను లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఓజి సినిమా( OG ) షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమాని మార్చ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో సుజిత్ స్టార్ డైరెక్టర్ గా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
సినిమా సినిమా కి బాగా గ్యాబ్ తీసుకుంటున్న సుజీత్ ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.

ఇక ఇప్పటికే నానితో ఒక సినిమాకి కమిట్ అయినప్పటికీ ఆ సినిమా అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.మరి తన తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓ జి సినిమా సూపర్ సక్సెస్ అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మొత్తానికైతే ఓజి టీజర్ ప్రేక్షకులందరిని అలరించింది.మరి సినిమా కూడా అలరిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
.