బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమురళి.. ఏం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి( Posani Krishna Murali ) బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.నేను గతంలో పవన్ ను తిట్టినట్టు ప్రూవ్ చేస్తే నేను లైవ్ లో గొంతు కోసుకుని చనిపోతానని పోసాని అన్నారు.

 Posani Krishna Murali Shocking Comments About Balakrisnna Details Inside Goes Vi-TeluguStop.com

గతంలో పవన్ ఫ్యాన్స్ తన కుటుంబాన్ని తిట్టారని పోసాని వెల్లడించారు.ఆ సమయంలో నాకు ఎవరూ మద్దతు తెలపలేదని పోసాని పేర్కొన్నారు.

Telugu Balakrisnna, Konda Surekha, Pawan Kalyan, Posanikrishna-Movie

సినిమా ఇండస్ట్రీ పరువు కొరకు ప్రతి సందర్భంలో తాను ముందుకు వచ్చానని పోసాని కామెంట్లు చేశారు.సినిమా కళామతల్లి నా కన్నతల్లి అని తాను ప్రతిసారి న్యాయం వైపు మాత్రమే ఉంటానని ఆయన పేర్కొన్నారు.నా ఫ్యామిలీపై జరిగిన మాటల దాడిని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఖండించినా బాలయ్య ఫ్యామిలీ మాత్రం ఖండించలేదని పోసాని పేర్కొన్నారు.

Telugu Balakrisnna, Konda Surekha, Pawan Kalyan, Posanikrishna-Movie

బాలయ్య గతంలో ఆడపిల్లలకు కడుపైనా చేయాలని ముద్దైనా పెట్టాలని కామెంట్స్ చేశారని అలాంటి వ్యక్తి నుంచి సురేఖ క్షమాపణలు చెప్పాలనే కామెంట్లు మనం చూడగలమా అని పోసాని ప్రశ్నించారు.నాగ్ కుటుంబానికి కొండా సురేఖ( Konda Surekha ) క్షమాపణలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు.పోసాని వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

పోసాని కామెంట్ల విషయంలో నాగ్ ఫ్యామిలీ నుంచి ఏదైనా రియాక్షన్ ఉంటుందేమో చూడాలి.మరోవైపు బాలయ్య సైతం రియాక్ట్ అయితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.బాలయ్య( Balakrishna ) సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో సత్తా చాటేలా బాలయ్య ప్లాన్స్ ఉన్నాయి.బాలయ్య భవిష్యత్తు సినిమాలు ఇతర భాషల్లో సైతం విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube