పిల్ల‌ల్ని కోరుకునే దంప‌తుల‌కు ఈ గింజ‌లు ఒక వ‌రం.. నిత్యం తింటే అదిరిపోయే లాభాలు మీసొంతం!

ఇటీవల కాలంలో చాలా మంది దంపతులు పెళ్లి అయిన వెంటనే పిల్లల్ని ( Kids ) కనడానికి మొగ్గు చూపడం లేదు.కెరీర్, గోల్స్ అంటూ వాటి వెనక పరుగులు పెడుతున్నారు.

 Health Benefits Of Sunflower Seeds For Couples Details, Sunflower Seeds, Sunflo-TeluguStop.com

ఏజ్ బార్ అయ్యే కొద్ది స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం( Infertility ) తగ్గిపోతుంది.ఈ కారణంగా ఎంతో మంది దంపతులు పిల్లలు కలగక బాధపడుతున్నారు.

అయితే పిల్లల్ని కోరుకునే దంపతులు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.

పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఫుడ్స్ దంపతుల్లో సంతాన‌లేమిని దూరం చేయడానికి చాలా బాగా సహాయపడతాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్(పొద్దు తిరుగుడు విత్త‌నాలు) కూడా ఆ కోవ‌కే చెందుతాయి.ఈ గింజలు పిల్ల‌ల్ని కోరుకునే దంపతులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు.నిత్యం ఈ గింజలను తగు మోతాదులో తీసుకుంటే అదిరిపోయే లాభాల‌ను పొందుతారు.

Telugu Tips, Infertility, Latest, Sperm, Sunflower Seeds, Sunflowerseeds-Telugu

స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్( Sunflower Seeds ) మ‌గ‌వారికి వివిధ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.రోజుకు ఒకటి నుంచి రెండు స్పూన్లు చొప్పున‌ స‌న్ ఫ్ల‌వర్ సీడ్స్ ను తీసుకుంటే చాలా మంచిది.విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, సెలీనియం, జింక్‌, కాపర్ వంటి పోష‌కాల‌కు గొప్ప మూల‌మైన స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ పురుషుల్లో ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

పునరుత్పత్తి పనితీరుకు మద్దతు ఇస్తాయి.

Telugu Tips, Infertility, Latest, Sperm, Sunflower Seeds, Sunflowerseeds-Telugu

అలాగే ఈ గింజ‌ల్లో మెండుగా ఉండే జింక్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది.సెలీనియం కంటెంట్ స్పెర్మ్ కణాలను( Sperm Cells ) ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది.ఇక‌ ఆడ‌వారిలో హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన కొవ్వు ఆమ్లాలను స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ అందిస్తాయి.

ఈ గింజ‌ల్లో ఉండే ఫోలేట్ పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.కాల్షియం, మెగ్నీషియం వంటి పోష‌కాలు ఎముక సాంద్రతను పెంచుతాయి.

విట‌మిన్ ఇ ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube