ఈ తరం హీరోయిన్స్ లేదా చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా వారింట్లో ఏ చిన్న పండగ జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఫోటోలు వీడియోలు చేస్తూ ఉంటాయి.కానీ ఒక తరం వెనక్కి వెళ్తే వారి సినిమా కెరియర్ టైంలో దిగిన ఫోటోలు దొరకడం కూడా చాలా రేర్ గా జరుగుతుంది.
అలాంటిది వారి పెళ్లి ఫోటోలు చూడాలంటే అదృష్టం ఉండాలి.అలనాటి నటి వాణిశ్రీ( Vanisri ) సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ముగిసిపోతుంది అనుకున్న సమయంలో వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది.
ప్రస్తుతం మనం వాణిశ్రీ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇక్కడ మనం చూస్తున్నా స్టిల్ ఆమె వివాహంలో తీసినదే కావడం విశేషం.ఆమె తన ఇంటి డాక్టర్ అయిన డాక్టర్ కరుణాకరణ్( Doctor Karunakaran ) నీ వివాహం చేసుకుంది.వీరి పెళ్లికి టాలీవుడ్ నుంచి అతిరథ మహారధులు అంతా కూడా హాజరయ్యారు.
షావుకారు జానకి లక్ష్మీరాజ్యం వాణిశ్రీని స్వయంగా పెళ్లికూతురుని చేసి పెళ్లి మండపానికి తీసుకొచ్చి కూర్చోబెట్టారట.ఇక షూటింగ్స్ హడావిడి ఉండడంతో వాణిశ్రీ వివాహానికి( Vanisri Marriage ) ఎన్టీఆర్ ఒకరు హాజరు కాలేకపోయారు అక్కినేని సైతం హడావిడిగా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోయారు.
వీరి వివాహం 1979 ఫిబ్రవరి 28వ తారీకున రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.చెన్నైలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి ఈ వివాహం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

అయితే వాణిశ్రీ పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో పెద్దగా ముహూర్తాలు లేవట.చివరగా ఉన్న ఒక మంచి ముహూర్తం లో హడావిడిగా పెళ్లి కానిచ్చేసారు.జయసుధ, రమాప్రభ, గీతాంజలి వంటి వారు కూడా పెళ్లి మండపంలో వాణిశ్రీ పక్కనే కూర్చున్నారు.అప్పట్లో హీరోయిన్స్ అందరూ చాలా కలుపుగోలుగా ఉండేవారు.ఒకరి ఇంట్లో పండగ అయితే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేవారు.అలా ప్రతి ఒక్కరూ ఈగోలకు పోకుండా ఎంతో మంచి స్నేహితులుగా కొనసాగారు ఇక వాణిశ్రీ పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యింది ఆమె ఆస్తులు కూడా పోగొట్టుకొని సొంత అక్కపైన కేసు వేసి గెలిచి మళ్ళీ తను పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి దక్కించుకుంది.