సినిమాల్లో హీరోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వారు వీరే !

చాలామంది ప్రస్తుతం ఉన్న నటీనటులు ఎవరో ఒకరిని చూసి ఇంప్రెస్ అయ్యే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.కానీ ఆ విషయాలను బయటకు చెప్పడానికి కొంత మంది ఒప్పుకోరు.

 These Stars Inspired By Other Tollywood Stars , Vijay Deverakonda , Sai Pallav-TeluguStop.com

ఇక వారు ఇన్స్పైర్ అయిన ఆ నటీనటుల రిఫరెన్సులు వారి సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి.ఏది ఏమైనా తమ స్టార్ హీరోలను అభిమానించడమే కాదు వారి లాగా ఇండస్ట్రీకి రావాలనుకుని కొంత మంది ఇండస్ట్రీకి వచ్చి నిజంగానే సక్సెస్ అయ్యారు.మరి అలా ఇండస్ట్రీకి వచ్చిన ఆ నటీనటులు ఎవరు వారు ? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ? అనే విషయాలను ఈ ఆర్థికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

విజయ్ దేవరకొండ

Telugu Chiranjeevi, Mahesh Babu, Sai Pallavi, Suhas, Tollywood, Tollywood Stars-

టాలీవుడ్ లో ఉన్న యంగ్ జనరేషన్ హీరోలలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఆయనకు ఇప్పుడు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.రౌడీ బాయ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.అయితే విజయ్ సినిమా ఇండస్ట్రీకి రావడానికి గల కారణం మహేష్ బాబు.

ఆయన నటించిన పోకిరి సినిమా చూసిన తర్వాతే విజయ్ లో హీరో అవ్వాలని కోరిక పుట్టిందట.ఆయన తీసే ప్రతి సినిమాలో మహేష్ బాబు సంబంధించిన సినిమాల రిఫరెన్స్ ఉండేలా చూసుకుంటారట విజయ్ దేవరకొండ.

సాయి పల్లవి

Telugu Chiranjeevi, Mahesh Babu, Sai Pallavi, Suhas, Tollywood, Tollywood Stars-

సాయి పల్లవి( Sai Pallavi ) ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇండియా వ్యాప్తంగా గొప్ప డాన్సర్ గా మరియు మంచి నటిగా కొనసాగుతుంది.అంతే కాదు ఆమె నటిస్తున్న నార్త్ రామాయణంలో సీత పాత్రలో అందరినీ అలరించబోతోంది.అయితే సాయి పల్లవి హీరోయిన్ గా ఇండస్ట్రీకి రావడానికి గల ముఖ్య కారణం చిరంజీవి.చిరంజీవి ముఠామేస్త్రి సినిమా చూసిన తర్వాత అందులో ఆయన వేసిన స్టెప్పులకు ఫ్యాన్ అయిపోయారు సాయి పల్లవి.

అలా ప్రతిరోజు ఆయన వేసిన స్టెప్పులను ప్రాక్టీస్ చేసేవారట.ఆయనను చూసే డ్యాన్స్ అవ్వాలనుకున్నారట.ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయిపోయారు.

సుహాస్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సుహాస్ ( Suhas )ఉన్నఫలంగా హీరో అయిపోయారు అలాగే ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా మంచి సినిమాలు తీస్తూ పదిమంది గుర్తించే విధంగా పాత్రలను పోషిస్తున్నాడు అయితే సుహాస్ ఇండస్ట్రీలో హీరో గా అయిపోవాలి అని అనుకోవడానికి గల ముఖ్య కారణం విజయ్ సేతుపతి( Vijay Sethupathi ).ఆయన నటన చూసి అలాగే పర్సనాలిటీ చూసి ఇంప్రెస్ అయిన సుహాస్ తాను ఎందుకు నటించకూడదు అనుకున్నారట.అలాగే ఆయన అనుకున్నట్టుగానే కలర్ ఫోటో సినిమా ద్వారా హీరో అయిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube