ఏందయ్యా ఇది.. బైక్‌ చుట్టూ ప్లాస్టిక్ షీల్డ్ వేశాడు.. చూస్తే ఆశ్చర్యపోతారు..!

సాధారణంగా బైక్ రైడర్లు( v ) తమ వాహనాలకు రకరకాల పరికరాలను అటాచ్ చేస్తుంటారు.వాటి ద్వారా బైక్ లుక్ ని మార్చేస్తుంటారు కొంతమంది అయితే బైకులను డ్రాగన్ అవ్వాలి మార్చేస్తుంటారు మరి కొంతమంది రకరకాల లైట్లు యాడ్ చేస్తారు.

 He Put A Plastic Shield Around The Bike You Will Be Surprised If You See It , Vi-TeluguStop.com

అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి కొంతమంది రైడింగ్ సౌకర్యం కోసం ఉపయోగకరమైన అప్‌గ్రేడ్స్‌ చేస్తుంటారు తాజాగా అలాంటి రైడర్ సోషల్ మీడియా యూజర్ల దృష్టిని ఆకర్షించాడు.బైక్ కు ఒక పర్ఫామెన్స్ అప్‌గ్రేడ్ చేశాడు.

దీనికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.ట్విట్టర్‌( Twitter )లో షేర్ చేసిన అతడి వీడియోలో సీటుపై ప్లాస్టిక్ షీల్డ్ లాంటి కవరింగ్ ఉన్న బైక్‌ను చూడవచ్చు.

వీడియోలో, బైక్ యజమాని వర్షం కురుస్తున్నప్పుడు ఇంటికి చేరుకుని షీల్డ్‌ను పైకి లేపుతాడు.అతను ఆపై బైక్ సీటు మీద కూర్చుని కవరింగ్‌ను తన పైన వేసుకుని, తన శరీరాన్ని వర్షం నుంచి రక్షించుకుని, బైక్‌ను స్టార్ట్ చేస్తాడు.షీల్డ్ కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా అతను ద్విచక్ర వాహనాన్ని సజావుగా నడుపుతూ కనిపిస్తాడు.ఈ వీడియో ఇప్పటివరకు 29 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది.ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది.“ఎవరు దీనిని మంచి ఆలోచన అనుకున్నారు?”, వీడియోకు ఒక క్యాప్షన్ కూడా జోడించారు.

ఈ ఆవిష్కరణపై నెటిజన్లకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఓ యూజర్ ట్వీట్ చేస్తూ, “ఇది మంచి ఆలోచన అని నేను అనుకుంటున్నా.అంతేకాకుండా చాలా మానవీయ డిజైన్” అని పేర్కొన్నారు.మరో వ్యక్తి ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు.ఈ షీల్డ్‌కు వైపర్లు, లేవని, షీల్డ్ గ్లాస్ డార్క్ గా ఉందని, కాబట్టి చీకట్లో చూడటం కష్టం అవుతుందని ఆయన ట్వీట్ చేశారు.

అంతేకాకుండా, ఈ షీల్డ్ ప్రమాద సమయంలో రక్షణ కల్పించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.హెల్మెట్ ధరించకపోవడం ద్వారా రైడర్ తన పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చుకున్నాడని తన పాయింట్‌ను ముగించారు.

మొత్తం మీద ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.బైకు సస్పెన్షన్ మార్చుకోవడం, చక్రాలు టైర్లు మార్చడం చూశాం కానీ ఇలాంటి అప్‌గ్రేడ్ మాత్రం ఎక్కడా చూడలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube