ఏపీ రాజకీయాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్( MLA Chintamaneni Prabhakar ) పేరు తెలియని వారు ఉండరు.2009, 2014 ఎన్నికలలో వరుసగా గెలిచి 2019 ఎన్నికలలో ఓడిపోయారు.ఆ తర్వాత ఇటీవల జరిగిన 2024 ఎన్నికలలో మళ్ళీ గెలవడం జరిగింది.ఈ క్రమంలో తెలుగుదేశంలో కీలక నేతగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గుర్తింపు కలిగిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళలు( Women of Telangana State ) సత్కరించారు.
ఆయన స్వగ్రామం దుగ్గిరాలలో సత్కరించటం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని సంతోషం వ్యక్తం చేశారు.
తన ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ తెలుగు మహిళల బృందంకి కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికలవేళ తన కోసం ఎంతో కృషి చేసిన ప్రతి తెలుగు మహిళలకు ఒక అన్న లాగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అభిమానానికి రాష్ట్ర సరిహద్దులు అడ్డుగోడలు కాలేవు అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మందపల్లి రజనీ సహా తెలుగు మహిళా విభాగం నాయకులు కామా అనిత, పల్లగాని రమ్య, మోదేపల్లి రమాదేవి, వెలగపూడి విజయలక్ష్మి తదితరలు పాల్గొన్నారు.ఇదే సమయంలో తెలుగు మహిళలకు పుట్టింటి కానుకను తలపించేలా పసుపు కుంకుమ, చీర వంటివి అందించి వారిని ఘనంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్కరించారు.