ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో రఘురామకృష్ణరాజు ( Raghuramakrishna Raju )ఉండి ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే.తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు.2019 ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి నరసాపురం ఎంపీగా ఎన్నికయ్యారు.అయితే ఆ సమయంలో వైసీపీ( YCP ) అధిష్టానంతో మనస్పర్ధలు రావడంతో.
రఘురామకృష్ణరాజు వైసీపీ నుండి తప్పుకోవడం జరిగింది.సరిగ్గా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
ఉండి ఎమ్మెల్యేగా గెలిచి.నియోజకవర్గ అభివృద్ధి కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగా డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్( Drainage Maintenance Infrastructure Fund ) ఉండి పేరిట నిధులు సమకూరుస్తున్నారు.ఈ నిధికి శనివారం సినీ నటుడు రావు రమేష్ 3 లక్షల రూపాయలు విరాళం అందించడం జరిగింది.ఈ మేరకు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఆ చెక్కును అందించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు ప్రముఖ సినీ నటుడు, నా మిత్రుడు రావు రమేష్ ( Ravu ramesh )గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
ఉండి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో కృషి చేస్తున్నారు.ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఇమేజ్ ఉండటంతో చాలామంది సినీ ప్రముఖులు సెలబ్రిటీలు.
ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వటానికి ముందుకొస్తున్నారు.