అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ - బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చా కార్యక్రమం వాడివేడిగా జరిగింది.పునరుత్పత్తి హక్కులు, ఇమ్మిగ్రేషన్ విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 Donald Trump And Joe Biden Us Presidential Debate Highlights , Al-baghdadi, Qase-TeluguStop.com

వీటిపై వీరిద్దరూ పరస్పరం ఆరోపణలు , విమర్శలు చేసుకున్నారు.తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అల్ బాగ్దాదీ, ఖాసీం సులేమానీ( Al-Baghdadi, Qasem Soleimani ) వంటి ఉగ్రవాదులను హతమార్చానని.

కానీ ఇప్పుడు తీవ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించి ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Al Baghdadi, Highlights, Donald Trump, Donaldtrump, Drugs, Guns, Joe Bide

అలాగే బైడెన్ సర్కార్ విదేశాంగ విధానాలను ట్రంప్ తూర్పారబట్టారు.అఫ్ఘాన్ నుంచి బలగాల ఉపసంహరణ దారుణంగా జరిగిందని.ఇందుకోసం తాను ఏర్పాటు చేసిన విధానాలను బైడెన్ యంత్రాంగం అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక గర్భవిచ్ఛిత్తి అంశాన్ని రాష్ట్రాల పరిధిలో ఉంచాలని ట్రంప్ సూచించారు.తుపాకులు, డ్రగ్స్ వ్యవహారాల్లో కొడుకుని కాపాడుకునేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నారని, అతని అరెస్ట్‌ను కూడా అడ్డుకున్నారని ట్రంప్ ఆరోపించారు.

తన హయాంలో పారిస్ ( Paris )పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోకుంటే దేశంపై లక్షల కోట్ల భారం పడేదని ట్రంప్ అన్నారు.

Telugu Al Baghdadi, Highlights, Donald Trump, Donaldtrump, Drugs, Guns, Joe Bide

మరోవైపు.బైడెన్ కూడా అంతే ఘాటుగా ట్రంప్‌కు కౌంటరిచ్చారు.ముఖ్యంగా తన వయసు గురించి మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన చురకలంటించారు.

తనకంటే ట్రంప్ మూడేళ్లు మాత్రమే చిన్న అని తెలిపారు.ప్రజాస్వామ్యంపై ట్రంప్‌కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, నాటో నుంచి అమెరికా తప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నారని బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ అంగీకరించలేదని.ఇప్పుడు మరోసారి ఓడిపోయినా ఆయన ఒప్పుకుంటారని తాను భావించడం లేదని అధ్యక్షుడు కుండబద్ధలు కొట్టారు.

గర్భవిచ్ఛిత్తి అంశంలో మహిళల ఆరోగ్యం గురించిన నిర్ణయాధికారం డాక్టర్లకే ఉండాలని, రాజకీయ నాయకులకు ఇందులో సంబంధం లేదని బైడెన్ అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube