నదియాలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ( Maulana Abul Kalam Azad University, Nadia )ఊహించని ఘటన చోటుచేసుకుంది.అప్లైడ్ సైకాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి.
ఏకంగా తన ప్రొఫెసర్‌కే సింధూరం పెట్టాడు.క్లాస్‌రూమ్‌లోనే ఈ పెళ్లి తంతు జరగడంతో అందరూ షాక్ అయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.విద్యార్థి ప్రొఫెసర్‌కు సింధూరం పెడుతుండగా, తోటి విద్యార్థులు చూస్తుండిపోయారు.
అంతేకాదు, ఇద్దరూ పూలదండలు కూడా మార్చుకున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ముగ్గురు సాక్షులు సంతకం చేసిన ఒక పత్రం బయటకు వచ్చింది.ఆ పత్రంలో విద్యార్థి, ప్రొఫెసర్.తాము భార్యాభర్తలమని ప్రకటించుకున్నట్లు ఉంది.వైరల్ అవుతున్న వీడియోలో మీరు చూడవచ్చు.
ఆ ప్రొఫెసర్ స్టూడెంట్ తో అచ్చం భార్య లాగానే ప్రవర్తిస్తోంది.
అయితే, ఆ ప్రొఫెసర్ మాత్రం ఇది నిజమైన పెళ్లి కాదని అంటున్నారు.అదంతా ఒక అకడమిక్ ప్రాజెక్ట్‌లో( academic project ) భాగమని చెప్పారు.కానీ, ఆ ప్రాజెక్ట్ ఉద్దేశమేంటో మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు.
ఈ ఘటనపై యూనివర్సిటీ సీరియస్‌గా స్పందించింది.ప్రొఫెసర్‌ను సెలవుపై పంపి విచారణకు ఆదేశించింది.
అసలు క్లాస్‌రూమ్‌లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.విద్యార్థులతోటి ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రస్తుతం చర్చినీయాంశంగా మారింది.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగింది.టిండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి.ఒక మహిళతో సీక్రెట్‌గా ఫేక్ వెడ్డింగ్ ప్లాన్ చేశాడు.సిడ్నీ ట్రిప్‌లో “ఆల్-వైట్ పార్టీ” ( All-White Party )అని చెప్పి ఆమెను పిలిచాడు.అందరూ సాధారణ దుస్తుల్లో ఉండగా, ఆమె మాత్రమే తెల్లటి దుస్తులు వేసుకుని వెళ్లింది.తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది అది ఫేక్ వెడ్డింగ్ అని.తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడానికే అతను ఇలా చేశాడని తెలుసుకొని ఆమె షాక్ అయింది.మోసపోయానని భావించిన ఆమె, అతనిపై లీగల్ యాక్షన్ తీసుకుంది.