క్యారెట్( Carrot ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రుచి పరంగానే కాదు పోషకాల పరంగానూ క్యారెట్ మధురమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఉడకబెట్టి లేదా వండుకొని తినే కన్నా పచ్చిగా తింటే క్యారెట్ లోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి.అందుకే చాలా మంది క్యారెట్ ను పచ్చిగానే తింటూ ఉంటారు.
అయితే ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా క్యారెట్ సహాయపడుతుంది.
ముఖ్యంగా ఒక క్యారెట్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా సీరం తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడితే మేకప్ లేకపోయినా కూడా మీరు అందంగా మెరిసిపోవడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం క్యారెట్ తో సీరంను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే అంగుళం పచ్చి పసుపు కొమ్ము( Green yellow horn ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పసుపు కొమ్ము ముక్కలు మరియు ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు( rose petals ) వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన సీరం సిద్ధమవుతుంది.
ఈ సీరం ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్యారెట్ సీరం ను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.రెగ్యులర్ గా ఈ సీరం ను వాడటం వల్ల స్కిన్ గ్లోయింగ్ గా మారుతుంది.క్యారెట్ లో ఉండే విటమిన్ సి( Vitamin C ) చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
అలాగే క్యారెట్లో కెరోటినాయిడ్స్ అనే సమ్మేళనాలు మన చర్మాన్ని యూవీ డ్యామేజ్ మరియు సూర్యకాంతి నుంచి కాపాడుతాయి.ఇప్పుడు చెప్పుకున్న క్యారెట్ సీరం స్కిన్ కేర్ రొటీన్లో భాగం చేసుకుంటే వైట్ గా, సూపర్ షైనీగా మెరుస్తుంది.
మొండి మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.క్లియర్ స్కిన్ మీసొంతం అవుతుంది.







