ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ను ఈడీ అధికారులు నాలుగో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.ఈ మేరకు లిక్కర్ స్కాం కేసులో ఇతర నిందితులతో కలిపి ఆయనను విచారించే అవకాశం ఉంది.
లిక్కర్ పాలసీ రూపకల్పనతో పాటు నిందితులతో ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు.రూ.100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చుతో పాటు లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్రపై అధికారులు కేజ్రీవాల్ ను ప్రశ్నించనున్నారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case)లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఈ నెల 28వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు.అదేవిధంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.కాగా తనను ఈడీ అరెస్ట్ చేయడంతో పాటు ట్రయల్ కోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.







