అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) బాధ్యతలు స్వీకరించడంతో ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ తిరిగి యాక్టీవ్ అవుతున్నారు.గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఆమె ఎంతో చురుగ్గా ఉండేవారు.2020 ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించడంతో ఇవాంక రాజకీయాలకు, పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉంటూ వచ్చారు.ప్రస్తుతం ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టడంతో ఇవాంక కూడా యాక్టీవ్ అవుతున్నారు.
తాజాగా కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చు బాధితులకు అవసరమైన సహాయం అందజేయడంతో పాటు భరోసా కల్పించారు. ఎన్జీవో సంస్థ సిటీ సర్వ్‌తో( NGO organization City Serv ) ఒప్పందం చేసుకున్న ఇవాంకా ట్రంప్.
ఎక్స్‌ప్రెషన్స్ చర్చి , ఎల్ఏ డ్రీమ్ సెంటర్‌లో పనిచేశారు.సాధారణ దుస్తుల్లో వాలంటీర్లతో కలిసి సాయం చేస్తూ ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు.డైపర్లు, ఆహారం సహా అత్యవసర సామాగ్రిని బాధితులకు పంపిణీ చేశారు ఇవాంకా.తర్వాత కిచెన్‌లో అగ్నిప్రమాద బాధితులకు వేడి భోజనం వడ్డిస్తూ కనిపించారు.

సిటీ సర్వ్ కో ఫౌండర్ డేవ్ డోనాల్డ్ సన్ ( CityServe Co Founder Dave Donald Son )మీడియాతో మాట్లాడుతూ.ఇవాంకా ప్రయత్నాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయన్నారు.బాధితులతో ఆమె గంటల తరబడి మాట్లాడి, వారికి అండగా నిలిచారని ప్రశంసించారు.ఇవాంకా సహాయం చేసిన చాలా కుటుంబాలు అన్నీ కోల్పోయాయనీ ఆయన తెలిపారు.ఇవాంకా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న రోజునే నటుడు బెన్ అఫ్లెక్స్ నిరాశ్రయులతో ( Ben Affleck Homeless )కలిసి స్వచ్ఛందంగా పనిచేశారు.పసిఫిక్ పాలిసేడ్స్‌లో 23000 ఎకరాలకు పైగా విధ్వంసం సృష్టించిన ఈ కార్చిచ్చు కారణంగా వేల కోట్ల ఆస్తి నష్టంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
పారిస్ హిల్టన్, హైడీ మోంటాగ్, స్పెన్సర్ ప్రాట్ వంటి ప్రముఖులు కూడా ఇమ ఇళ్లను కోల్పోయిన వారిలో ఉన్నారు.

మరోవైపు.కార్చిచ్చు కారణంగా సర్వం కోల్పోయిన వారికి అమెరికాలోని సిక్కు సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మందికి ఉచిత భోజనం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నాయి.
లెట్స్ షేర్ ఏ మీల్ సంస్థకు చెందిన ఓంకార్ సింగ్ మాట్లాడుతూ.సిక్కు మత వ్యవస్ధాపకుడు గురునానక్ బోధనల నుంచి ప్రేరణ పొందిన తాము ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు.