మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తల్లి అంజనమ్మ ( Anjanamma )పుట్టినరోజు( Birthday ) వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రతి ఏడాది చిరంజీవి తన తల్లి పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుతారో అలాగే ఈ ఏడాది కూడా చిరంజీవి ఇంట్లోనే తన తల్లి పుట్టిన రోజు వేడుకలను జరిపినట్టు తెలుస్తుంది.ఇక ఈ వీడియోలో అంజనమ్మ వస్తూ ఉండడంతో ఆమె పై పువ్వులు చల్లుతూ ఘన స్వాగతం పలికారు అనంతరం తన చేత కేక్ కట్ చేయించారు.

ఈ పుట్టినరోజు వేడుకలలో చిరంజీవి దంపతులు రాంచరణ్ ( Ram Charan )దంపతులతో పాటు నాగబాబు భార్య ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇలా కేక్ కట్ చేసిన అంజనమ్మ అందరికీ కేక్ తినిపిస్తూ బాగుంది నాన్న.మీ అందరూ ఉంటే నాకు ఇంకేం కావలి.మీ అందర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంటుంది అంటూ ఎమోషనల్ అయి చెప్పింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన చిరంజీవి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.

అమ్మా.ఈ స్పెషల్ రోజున మేము నిన్ను మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నామని, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవిస్తున్నామని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.మా అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.ఈమె మా కుటుంబానికి హార్ట్ లాంటిది ఈమె మా బలగం స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం. నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి అంటూ పోస్ట్ చేశారు.ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గారు నిలిచారు.
ఇక ఈ వీడియో తీసింది కూడా రాంచరణ్ కావడంతో మెగా అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.ఇక రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో RC 16లో నటిస్తున్న విషయం తెలిసిందే.