ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.11
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.10.20 ల10.54 సా.5.20 ల6.08
దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ.2.48 ల3.36
మేషం:

ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి.
వృషభం:

ఈరోజు సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి.స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
మిథునం:

ఈరోజు ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.వ్యాపారాలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి.ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.దైవదర్శనాలు చేసుకుంటారు.
సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.
మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.
కన్య:

ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన భూ లాభాలు కలుగుతాయి.పాత బాకీలు వసూలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది.ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
తుల:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి.అవసరానికి ధనసహాయం లభిస్తుంది.నూతన వాహన సౌఖ్యం ఉన్నది వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీ సంతాన విషయం లో జాగ్రతలు తీసుకోవాలి.ఇతరులతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది.
ధనుస్సు:

ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.మొండి బాకీలు వసూలవుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు.ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.
మకరం:

ఈరోజు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన వాహన యోగం ఉన్నది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అధికారులతో చర్చలు ఫలిస్తాయి.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
కుంభం:

ఈరోజు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.పని ఒత్తిడి అధికమవుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం:

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలలో లాభాలు అందుతాయి.పనులు సజావుగా సాగుతాయి.ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు.ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి.