ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ శరీరక, మానసిక స్థితిలో అనేక మార్పులు సంభవిస్తాయి.ఆ మార్పులకు అనుగుణంగా సరైన ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.
ప్రెగ్నెన్సీ సమయంలో తినే ఆహారం తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదలో కీలక పాత్రను పోషిస్తుంది.అయితే ప్రెగ్నెన్సీ టైమ్ లో తినదగ్గ ఆహారాల్లో కీర దోసకాయ ఒకటి.
ఇది శరీరానికి అవసరమైన వాటర్ తో పాటు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ( Vitamins, minerals, fiber )లను అందిస్తుంది.
సాధారణంగా గర్భధారణలో మలబద్ధక సమస్య ( Constipation problem )ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ ప్రాబ్లమ్ కు కీర దొసరకాయతో చెక్ పెట్టవచ్చు.ఫైబర్ అధికంగా ఉండటం వల్ల నిత్యం కీర దోసకాయను తీసుకుంటే జీర్ణవ్యవస్థ సజావుగా పని చేస్తుంది.
మలబద్ధకం దూరం అవుతుంది.హై బ్లడ్ ప్రెజర్ సమస్య ఉన్న గర్భిణీలు తమ డైట్ లో కీర దోసకాయను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం.
కీరదోసకాయలో పొటాషియం, మెగ్నీషియం మెండగా ఉంటాయి.ఇవి అధిక రక్తపోటును అదుపులోకి తెస్తాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కొందరు పలు చర్మ సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు.అయితే రెగ్యులర్ గా కీర దోసకాయను తీసుకుంటే.యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ( Antioxidants, vitamin C )చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.స్కిన్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అలాగే కీరదోసకాయ డిటాక్స్ ఫుడ్‌లాగా పనిచేస్తుంది.నిత్యం కీరదోసకాయను తీసుకుంటే.
మూత్ర విసర్జన ద్వారా శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటికి పంపిస్తుంది.

అంతేకాకుండా.కీరదోసకాయలో( cucumber ) తక్కువ క్యాలరీలు, అధికంగా నీరు ఉండటంతో, అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది.నీరు అధిక మొత్తంలో ఉండటం వల్ల కీరదోసకాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
అలసట, తలనొప్పి ( Fatigue, headache )వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.అయితే ఆరోగ్యానికి మంచిదన్నారు కదా అని కీరదోసకాయను ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధక సమస్యలు రావచ్చు.
అలాగే కీరదోసకాయను ఉదయం లేదా మధ్యాహ్నం తినడం మంచి ఎంపిక అవుతుంది.రాత్రిపూట తింటే అజీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.