బిర్యానీ ఆకు.అద్భుతమైన సువాసన కలిగి ఉండటమే కాదు బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటుంది.అందుకే బిర్యానీ ఆకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.అలాగే కేశ సంరక్షణలోనూ బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది.అవును, చుండ్రును నివారించడంలోనూ, జుట్టు రాలడాన్ని తగ్గడంలోనూ, కేశాలను ఒత్తుగా పెరిగేలా చేయడంలో బిర్యానీ ఆకులు సూపర్‌గా సహాయపడుతుంది.
మరి బిర్యానీ ఆకును శిరోజాలకు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కొన్ని బిర్యానీ ఆకులను మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో గ్లాస్ వాటర్ పోసి.అందులో ఒక స్పూన్ బిర్యానీ ఆకుల పొడి, ఒక స్పూన్ మెంతుల పొడి వేసి బాగా మరిగించాలి.
అపై వాటర్‌ను వడబోసుకుని.చల్లారనివ్వాలి.
ఆ తర్వాత ఈ వాటర్‌లో రెండు స్పూన్ల కరివేపాకు రసం, రెండు స్పూన్ల ఉల్లిపాయ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకుని.అప్పుడు దూది సాయంతో తలకు పూయాలి.
గంట తర్వాత తల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ సమస్యే ఉండదు.
మరియు జుట్టు ఒత్తుగా, దృఢంగా కూడా పెరుగుతుంది.
అలాగే చుండ్రును సమస్యను నివారించడంలో బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది.
అందు కోసం, ముందుగా ఒక బౌల్‌లో కొన్ని నీటిని తీసుకుని.అందులో మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులు వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.
ఉదయాన్నే నీటితో సహా మెత్తగా పేస్ట్ చేసి.ఆ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించాలి.
అపై గోరు వెచ్చని నీటితో హెడ్ చేయాలి.నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేశారంటే చుండ్రు సమస్య పరార్ అవుతుంది.

ఇక పేలతో ఇబ్బంది పడే వారు.ఒక గ్లాస్ వాటర్‌లో ఒక స్పూన్ బిర్యానీ ఆకు పొడి వేసి హీట్ చేయాలి.అనంతరం ఈ వాటర్‌ను తలకు స్ప్రే చేసుకుని గంట తర్వాత హెడ్ బాత్ చేయాలి.ఇలా తరచూ చేస్తే పేలు పోతాయి.