పెళ్లయిన ప్రతి మహిళా మాతృత్వాన్ని కోరుకుంటుంది. ప్రెగ్నెన్సీ ని ఎంతో ఎంజాయ్ చేస్తుంది.
కానీ ప్రసవం తర్వాత శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడపాల్సి ఉంటుంది.
ఏ పని చేసుకోవాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.కొందరు ప్రసవం తర్వాత డిప్రెషన్ కు కూడా లోనవుతుంటారు.
అలాగే ముఖంలో మునుపటి మెరుపు అస్సలు కనిపించదు.దీని కారణంగా అద్దంలో తమను తాము చూసుకున్నప్పుడల్లా లోలోన తెగ మదన పడుతూ ఉంటారు.
కానీ చింతించకండి.

కొన్ని కొన్ని చిట్కాలతో డెలివరీ ( Delivery )తర్వాత ముఖంలో మునుపటి మెరుపును మళ్ళీ తెచ్చుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అందుకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం( Rice ) వేసి వాటర్ పోసి నైట్ అంతా పెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు క్యారెట్ స్లైసెస్, పావు కప్పు బొప్పాయి పండు( Papaya fruit ) ముక్కలు మరియు నానబెట్టుకున్న బియ్యం వేసి స్మూత్ ఫ్యూరీ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ప్యూరీని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.ఇందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, చిటికెడు ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఆపై మంచి మాయిశ్చరైజర్ చర్మానికి అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ముఖం కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.
ప్రెగ్నెన్సీ వల్ల చాలా మంది ముఖ చర్మం సాగుతుంటుంది.అయితే బొప్పాయిలో ఉండే పలు సుగుణాలు సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.
ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.అలాగే ఈ రెమెడీ చర్మం పై మొండి మచ్చలను నివారిస్తుంది.
స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.ఈ రెమెడీతో మళ్ళీ మీ ముఖం మునుపటి మాదిరి అందంగా ప్రకాశవంతంగా మారుతుంది.